వైసీపీ అభ్యర్ధుల విషయంలో జగన్ షాకింగ్ డెసిషన్

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలు ఎంత ఉత్ఖంటగా మారబోతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.గత ఎన్నికలతో పోల్చితే వచ్చే ఎన్నికలు మాత్రం ఏపీలో ఉన్న అన్ని పార్టీలకి చావో రేవో అన్నట్టుగానే ఉన్నాయి.

 Ys Jagan Shocking Decision-TeluguStop.com

ఈ సారి గనుక వైసీపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి రాకపోతే.ఇక అంతే సంగతి అంటున్నారు.

మరో వైపు అధికార పక్షంలో ఉన్న టిడిపి మళ్ళీ అధికారంలోకి రాకపోతే.లోకేష్ ఫ్యూచర్ మాత్రం డౌట్ అంటున్నారు.

ఇదిలా ఉంటే ఆటలో అరటిపండు లాంటి పార్టీ జనసేన.అసలు పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు అంటే చంద్రబాబు ని తన ఫ్యాన్స్ ఓట్లతో గెలిపించడానికే అన్న విషయం చెడ్డీ వేసుకున్న చిన్న పిల్లాడిని అడిగినా సరే తడుముకోకుండా చెప్తాడు.

ఇదిలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి ఈ సారి ఎక్కడా తన అంచనాలు మించకుండా పక్కా ప్లాన్డ్ గా ఎన్నికల యుద్దానికి సిద్దం అవుతున్నాడు.నాయకుడు ఒక్కడికి ధైర్యం ,తెలివితేటలు ఉంటే సరిపోవు.

నాయకుడి తో పాటు వెనకాల ఉండే ఎమ్మెల్యేలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలి అందుకే జగన్ వైసీపిలో ఈ సారి టిక్కెట్స్ ఇచ్చే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారని తెలుస్తోంది.ఎవరు ఎవరు టికెట్స్ ఆశిస్తున్నారో వారికి “ మూడు కండిషన్స్”అప్ప్లై అంటున్నారు.

ఈ మూడు విషయాలలో అధినాయకుడు సంతృప్తి చెందితేనే టిక్కెట్ లేదంటే ఎంతటి వారికైనా సరే నో టిక్కెట్.

ఇంతకీ జగన్ పెట్టిన ఆ మూడు నిభందనలు ఏమిటంటే.

”ఆర్ధిక పరిస్థితి”, “సమాజిక వర్గ సమీకరణాలు” , ”గెలుపు గుర్రాలు”…జగన్ పెట్టిన ఈ మూడు అర్హతలు ఉంటేనే టికెట్స్ ఖాయం చేస్తారట.ఆర్ధిక స్థితి అనేది గత ఎన్నికలు కంటే కూడా వచ్చే ఎన్నికల్లో ఎంతో ముఖ్యం.

అందుకే డబ్బుకు వెనకాడకుండా ఉండే వాళ్ళు ఇప్పుడు పార్టీకి ఎంతో ముఖ్యం.గత ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక హడావిడిగా సాగింది ఆ సమయంలో కుల ప్రాతిపదికన సమన్యాయం చేయలేకపోవడం జగన్ కి చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది అందుకే మరొకమారు ఇలాంటి తప్పు చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు.

గెలిచే సత్తా ఉన్న వ్యక్తులకే టికెట్స్ ఈ విషయంలో మాత్రం జగన్ రాజీ ఎక్కడ పడట్లేదు అంటున్నారు.సో ఈ మూడు అంశాలలో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారో వారికే మొహమాటం లేకుండా టిక్కెట్స్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube