పీఆర్సీ గొడ‌వ‌లోకి చంద్ర‌బాబును లాగుతున్న వైసీపీ..

చిత్ర విచిత్ర రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఏపీ మారుతోంది.ఏది జ‌రిగినా, ఏం చేసినా చంద్ర‌బాబే చేశాడంటూ బాబు పైనే తోసేయడం వైసీపీ నేత‌ల‌కు ప‌రిపాటిగా మారుతోంది.

 Ycp Dragging Chandrababu Into Prc Issue Details, Ycp, Chandrababu, Ap Cm Jagan,-TeluguStop.com

అంత‌టితో ఆగ‌కుండా విచ్చ‌ల‌విడిగా కామెంట్లు చేయడాన్ని కూడా తేలిక‌గా తీసుకుంటున్నారు.అస‌లు కొన్నిఅంశాలు చూస్తుంటే సిల్లీగా అనిపిస్తుంటుంద‌ని నోరుపారేసుకుంటుంటారు.

మ‌రోవైపు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స‌మ్మె బాట ప‌ట్టారు.మూడ్నాల్నెల్లుగా త‌మ స‌మ‌స్య‌లను చ‌ర్చ‌ల పేరుతో ప్రభుత్వానికి చెప్పుకున్నారు.

ప‌లుమార్లు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో భేటీ అయ్యారు.కొన్ని అంశాల్లో ప్ర‌భుత్వంతో విభేదించి చ‌లో విజ‌య‌వాడ పేరుతో భారీ ఎత్తున నిర‌స‌న‌లతో హోరెత్తించారు.

అది స‌క్సెస్ భారీగా స‌క్సెస్ అయింది.

అయితే అత్త‌మీది కోపం దుత్త మీద చూపిన‌ట్టు వైసీపీ నేత‌లు టీడీపీపై తోసేస్తున్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆందోళ‌న‌ను చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నార‌ని ఆర‌పిస్తున్నారు మంత్రి అవంతి శ్రీనివాస‌రావు. చంద్ర‌బాబు నాయుడు విప‌క్ష నేత‌గా ఉండ‌డం ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని తెలిపారు.ఏ స‌మ‌స్య‌నైనా రాజ‌కీయ ల‌బ్ధి కోసం వాడుకునేందుకే ప్ర‌య‌త్నిస్తుంటార‌ని పేర్కొంటుంటారు.మ‌రో వైపు టీడీపీ నేత‌లు కూడా వైసీపీకి ధీటుగా ప్ర‌శ్న‌ల బాణాలు విసురుతున్నారు.

నాడు 20శాతం ఫిట్మెంట్ ఇస్తామ‌ని బాబు అంటే జ‌గ‌న్ 27 శాతం ఫిట్మెంట్ పేరుతో ఎన్నిక‌ల పాద‌యాత్ర‌లో చెప్పారు క‌దా అంటూ గుర్తు చేస్తున్నారు.

అంటే అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు ఉద్యోగుల‌కు మ‌ధ్య జ‌గ‌న్ జోక్యం చేసుకుని రాజ‌కీయం చేశారనుకోవాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు.జ‌గ‌న్ రాజ‌కీయ చ‌ద‌రంగం ఆడితే బాబు అదే బాట‌లో పావులు క‌ద‌పుతాడ‌ని అంటున్నారు.ఏపీలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు కార‌ణం అధికార పార్టీ పెద్ద‌ల‌దేన‌ని జోస్యం చెబుతున్నారు.

వాస్త‌వంగా వైసీపీకి ప‌ట్టం క‌ట్టాల‌ని కోరుకున్న వారిలో ఉద్యోగులే అధికంగా ఉన్నారు.అందుకే రెండేండ్లుగా ఓపిక ప‌ట్టి చివ‌ర‌కు ఆందోళ‌న‌కు దిగారు.

దీనికి కార‌ణం వైసీపీ కాదా అని అంటున్నారు.రాత్రికి రాత్రి జీఓలు జారీ చేసి హెచ్ఆర్ఏలో కోత విధించి ఐఆర్ విష‌యంలో 27శాతం రిక‌వ‌రీ అని చెప్పి అగ్గి రాజేసింది వైసీపీ కాదా అని ప్ర‌శ్న‌స్తున్నారు.

ఇదే విష‌యాన్ని తాము అంటే త‌ప్పు ఎలా అవుతుంద‌ని టీడీపీ నేత‌లు తేల్చి చెబుతున్నారు.ఈ తతంగ‌మంతా చూస్తుంటే వైసీపీకి బాబు ఫివ‌ర్ ప‌ట్టుకుందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.ఉద్యోగుల విష‌యంలో మంత్రి అవంతి, వైసీపీ నేత‌లే స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేసి చంద్ర‌బాబుపై ఆ నింద‌ను వేస్తున్నార‌ని అంటున్నారు.ఇవ‌న్ని ఒక‌సారి ప‌క్క‌న బెడితే ఏపీలో 8ల‌క్ష‌ల‌మంది ఉద్యోగులు, సుమారు నాలుగైదు ల‌క్షల‌మంది పెన్ష‌న‌ర్లు ఉన్నారు.

ఇంత భారీగా ఉద్యోగుల బ‌లం ఉంటే రాజ‌కీయం చేసేదంతా బాబేన‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం వైసీపీకే ప్ర‌మాద‌ని జోస్యం చెబుతున్నారు.

Chandrababu Naidu Behind PRC Issue Chandrababu Naidu YCP

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube