కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరుల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు తీవ్ర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తన భార్య ఫోన్ కి గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చిందనే నెపంతో ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ ఏకంగా హత్య చేసినటువంటి ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందినటువంటి క్రోసూరు మండలంలోని ఓ గ్రామంలో గ్రామంలో ఇద్దరు దంపతులు నివాసం ఉండేవారు.అయితే వీళ్ళు కుటుంబ పోషణ నిమిత్తమై చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళు.
అయితే ఏమైందో ఏమోగానీ ఈ మధ్యకాలంలో వివాహిత భర్త తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు.ఈ అనుమానం కాస్త ఈ మధ్య కాలంలో పెనుభూతం అయింది.ఇందులో భాగంగా తరచూ తన భార్యని ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని చిత్రహింసలకు గురిచేస్తూ హింసించేవాడు.దీంతో తాజాగా ఇటీవలే వ్యక్తి భార్యకు గుర్తు తెలియని నెంబర్ నుంచి మిస్సిడ్ కాల్ రావడంతో ఈ అనుమానం కాస్త మరింత పెరిగింది.
దీంతో భార్యాభర్తలు ఇద్దరూ ఈ విషయంపై గొడవ పడ్డారు.అయితే అప్పటికే అనుమానం పెనుభూతం కావడంతో క్షణికావేశానికి లోనైనటువంటి వివాహిత భర్త ఆమెను దారుణంగా గొంతుని నులిమి హత్య చేశాడు.
అనంతరం భయపడిన మృతురాలి భర్త వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను హత్య చేసినట్లు సమాచారం అందించి లొంగిపోయాడు.