గ్రామంలోకి వచ్చిన అడవి దున్న.. ఈ యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా

కొన్నిసార్లు అడవుల్లో ఉండే జంతువులు జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి.పులులు, సింహలు, చిరుతలు, ఏనుగులు లాంటి క్రూరమృగాలు కూడా ప్రజలు నివసించే ప్రాంతాల్లోకి అడవుల నుంచి వస్తూ ఉంటాయి.

 Woman In Udupi Offers Water Food To Bison Spotted Her Home Details, Wild Buffalo-TeluguStop.com

ఇక పాములు లాంటివి కూడా జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి.దీంతో వాటిని పట్టుకుని తిరిగి అడవుల్లోకి పంపించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

క్రూరమృగాలు జనావాసాల్లోకి వచ్చి పశువులు, మనుషుల మీద దాడి చేసిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.దీంతో క్రూరమృగాలను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు.

Telugu Bison, Brave, Karnataka, Latest, Udipi, Udipi Bison, Wild Animals, Wild B

కొన్నిసార్లు అడవుల్లో నీళ్లు దొరక్క నీటి కోసం క్రూర జంతువులు అడవుల నుంచి సమీపంలోని గ్రామాల్లోకి వచ్చి కలకలం సృష్టిస్తూ ఉంటాయి.అయితే ఇలా అడవుల నుంచి గ్రామంలోకి వచ్చిన అడవి దున్నపోతును( Wild Buffalo ) చూసి ఓ మహిళ అసలు భయపడలేదు.అంతేకాకుండా దానితో సంభాషించేందుకు ప్రయత్నించింది.దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) విపరీతంగా వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మూగజీవాల పట్ల మహిళకు ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతున్నారు.

మాములుగా ఎవరైనా సరే ఇలాంటి జంతువులను చూస్తే భయపడతారు.మనపై దాడి చేస్తాయనే భయంతో కనిపిస్తే పరుగులు పెడతారు.

కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న యువతి దున్నపోతుతో సంభాషించింది.

Telugu Bison, Brave, Karnataka, Latest, Udipi, Udipi Bison, Wild Animals, Wild B

కర్ణాటకలోని( Karnataka ) ఉడుపి ప్రాంతంలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది.పశ్చిమ కనుమల ప్రాంతంలో అడవికి సమీపంలోని గ్రామంలో ఈ ఘటన జరిగింది.మహిళ దున్నపోతుతో సంభాషించే ప్రయత్నం చేయగా.

ఆ తర్వాత దున్నపోతు తిరిగి వెళ్లిపోయింది.దీంతో మహిళ ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మంచి ధైర్యవంతురాలు అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.మూగజీవాలకు కూడా మనస్సు ఉంటుందని, వాటితో మంచిగా ఉంటే ఏం చేయవని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube