సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ రాముడైతే ఆయన తమ్ముడు త్రివిక్రమ రావు లక్ష్మణుడు అని అంటారు.అంతలా వీరిద్దరి మధ్య అనుబంధం ఉండేది.
అన్న ఏదైనా చెబితే తమ్ముడు జెవదాటేవాడు కాదు.అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎంతో బిజీగా ఉన్న సందర్భంలో త్రివిక్రమ రావు అటు కుటుంబాన్ని, ఇటు పార్టీని తన భుజస్కందాలపై మోసాడు.
తాను కుటుంబాన్ని చూసుకుంటానని చెప్పి ఎన్టీఆర్ ని చెన్నై పంపించి మరి సినిమాల్లో నటించాలని ప్రోత్సహించాడు.
కేవలం మన సొంత బ్యానర్ లోనే కాకుండా బయట సినిమాలను చేయాలంటూ త్రివిక్రమ రావు ఎప్పుడు సలహాలు ఇస్తుండేవాడు.
ఏదైనా ఎన్టీఆర్ సినిమా మొదలైతే చాలు క్లాప్ కొట్టాలంటే అక్కడ త్రివిక్రమ రావు ఉండాల్సిందే.అంతలా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండేది.పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం వెనక త్రివిక్రమ రావు పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి.చివరికి కృష్ణ కుమారి తో పెళ్లికి ఒక రోజు ముందు, ఆ పెళ్లిని తప్పించింది త్రివిక్రమ రావే.
తన వదిన కన్నీళ్లు చూడలేక రాత్రికి రాత్రే కృష్ణ కుమారి ని బెంగుళూరు పంపించాడు.అంతా చేసిన ఎన్టీఆర్ తమ్ముడిని ఏమీ అనలేదు.
త్రివిక్రమ రావు తన కుటుంబం గురించి ఏనాడు ఆలోచించకుండా కేవలం తన అన్న గారి గురించే ఆలోచించాడు.త్రివిక్రమ రావు భార్య పేరు లక్ష్మి, అలాగే వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.అంతా సజావుగా సాగుతుంది అన్న క్రమంలో తనకు తెలియకుండా పార్టీ శ్రేయస్సు కోసం ఒక 20,000 ఫండ్ కలెక్ట్ చేశాడని ఎన్టీఆర్, త్రివిక్రమ రావు పై కోప్పడ్డాడు.చేసింది మంచి పని అయినా కూడా చెప్పి చేయాలంటూ మందలించి అతనిని దూరం చేసుకున్నాడు.
చివరికి త్రివిక్రమ రావు ఇద్దరు కొడుకులను హీరోలుగా చేసినా కూడా ఏనాడు ఎన్టీఆర్ సపోర్ట్ వారికి దొరకలేదు.కానీ చివరి దశలో అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయారు అంటారు కొందరు.