ప్రకాష్ రాజ్( Prakash Raj )… ఒకప్పుడు సౌత్ ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్ లో ఆయన ఒక నెంబర్ వన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లెక్కలేనన్ని సినిమాల్లో నటించారు.కానీ కాలం మారుతున్న కొద్ది కొత్త నీరు వచ్చి చేరింది.
ప్రకాష్ రాజ్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.అదే సమయంలో ఆయన చేసే కొన్ని తప్పిదాలు కూడా ఆయన కెరీర్ ను ప్రమాదంలో పడేసాయి.
ముఖ్యంగా ఆయన ఈగో మరియు ఆటిట్యూడ్ అలాగే టైం పాటించకపోవడం వంటి కొన్ని విషయాలు దర్శకులకు ప్రకాష్ రాజ్ ని దూరం చేస్తూ వచ్చాయి.అయితే ఆయన స్థానంలో ఒక్కో ఇండస్ట్రీకి ఇప్పుడు ఒక్కో గొప్ప నటుడు దొరికాడు.మరి సదరు ఇండస్ట్రీలను ప్రకాష్ రాజ్ స్థానంలో వచ్చి ఏలుతున్న ఆ నటులు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మురళీ శర్మ
అతిధి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు మురళీ శర్మ.ప్రస్తుతం వాల్మీకి గా టాలీవుడ్ ఇండస్ట్రీకి నిలిచిపోయాడు.ఆయన ఏటా దాదాపు పదికి పైగా సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మంచి పర్ఫార్మర్ దొరికాడు అని అనిపించుకున్నాడు.
తెలుగు తో పాటు తమిళ్, హిందీ మరియు మరాఠీ లోను అనేక సినిమాల్లో నటిస్తున్నారు.అయితే 2023 సంవత్సరం లో చూసుకుంటే వీరసింహ రెడ్డి, వినరో భాగ్యము విష్ణు కథ, Mr.కింగ్, రావణాసుర, ఏజెంట్, రంగబలి, ఖుషి, టైగర్ నాగేశ్వర రావు, మై నేమ్ ఈజ్ శృతి, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి వంటి చిత్రాల్లో నటించారు.
అచ్యుత్ కుమార్
కన్నడలో ప్రస్తుతం ప్రకాష్ రాజ్ స్థానాన్ని భర్తీ చేసిన నటుడు అచ్యుత్ కుమార్( Achyuta Kumar ) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈయన కూడా దాదాపు ఏడాదికి పదికి పైగా సినిమాల్లో నటిస్తున్నారు.తెలుగు వారికి కేజిఎఫ్ సినిమాల ద్వారా సుపరిచితమైన అచ్యుత్ కుమార్ ఒక 2023 సంవత్సరాన్ని ఉదాహరణగా తీసుకుంటే వీరం, గురుదేవ్ కోసయ్యా, రాఘవేంద్ర స్టోరీస్, సిరెన్, కౌసల్య సుప్రజా రామా, క్షేత్రపతి, సప్తసాగర దాచే ఎల్లో సైడ్ A, వామన అనే చిత్రాల్లో నటించాడు.
గౌతమ్ మీనన్
ప్రస్తుతం దర్శకత్వం మానేసి పూర్తి స్థాయిలో నటుడుగా స్థిరపడిపోతున్నాడు వెటరన్ డైరెక్టర్ గౌతమ్ మీనన్.2023 సంవత్సరంలో ఏకంగా పదికి పైగా సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాడు.ఈ ఏడాది చూసుకుంటే మైకేల్, లవ్ ఫుల్లీ యువర్స్ వేదా, పతు తల విడుదల పార్ట్ 1, అనురాగం, తక్కర్, ఉస్తాద్, కారుమేగంగల్ కలిగిందరణ, మాతాగం, లియో వంటి సినిమాలో నటించాడు.