దేవరకొండ కాంగ్రెస్ "నాయక్" ఎవరు...?

నల్లగొండ జిల్లా: దేవరకొండ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ( Congress party ) అభ్యర్ధి నువ్వా నేనా అన్నట్లుగా ఉంది.

ఇక్కడి నుండి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నవారిలో దాదాపు ఐదారుగురు ప్రధానంగా ఉన్నారు.

వారిలో కాంగ్రెస్ పార్టీ దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,మాజీ జెడ్పీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, ఆదివాసీ మేఘాలయ ఇంఛార్జి,ఉస్మానియా ఉద్యమ నేత వడత్య రవి నాయక్,నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటున్న ఎంపిటిసి,కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,ప్రవళిక కిషన్ నాయక్,గత ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో బీఎస్పీ నుండి పోటీ చేసి,తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన మరో నేత బిల్యా నాయక్( Bilya Naik ), విద్యావంతుడుగా పేరున్న వడ్య రమేష్ నాయక్( Vadya Ramesh Naik ) పేరు కూడా ఇటీవల సామాజిక మాధ్యమాలలో బాగా వినిపిస్తుంది.మొదటి నుండి పార్టీలో ఉంటున్న రామ జగన్ లాల్ కూడా తనకే టిక్కెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.

Who Is

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో టికెట్ తనకే వస్తుందని ఎవరికి వారే గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే పార్టీ అధికారంలో లేకపోయినా గత పదేళ్లుగా పార్టీని,క్యాడర్ ను కాపాడుకుంటూ,నియోజకవర్గ ఇంచార్జీగా ఉంటూ వస్తున్న నేనావత్ బాలూ నాయక్ కే ఎక్కువ ఆకాశం ఉందనేది పార్టీలో టాక్ నడుస్తోంది.

మిగతా వారు కూడా తమ తమ స్థాయిల్లో పార్టీకి విధేయులుగా పని చేస్తున్న వారే కావడంతో తమకే టిక్కెట్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే టికెట్ ఎవరికి వచ్చినా కూడా ఈసారి దేవరకొండ ఖిల్లా పైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉండాలని తమలో తమకు గొడవలు లేకుండా ఉండాలని అందరూ ఏకతాటిపై వస్తే విజయం సాధిస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు.

Advertisement

దీనితో టిక్కెట్ దక్కేదెవరికి, అభ్యర్ధిగా నిలిచేదెవరు అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ప్రస్తుతం అయోమయం నెలకొంది.

సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా మీ సేవలో తీసుకోవచ్చు...!
Advertisement

Latest Nalgonda News