రెండు చోట్ల రేవంత్ పోటీ ఎక్కడెక్కడంటే ?

ఇప్పటికే బీఆర్ఎస్( BRS ) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )గజ్వేల్ తోపాటు , కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు.మిగతా రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ ను టార్గెట్ చేసుకున్నారు.

 Where Is Revanth Competing In Two Places , Revanth Reddy, Telangana Elections,-TeluguStop.com

ఇప్పటికే గజ్వేల్ లో బిజెపి కీలక నేత ఈటల రాజేందర్ పోటీ చేయబోతుండగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసిఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి నామినేషన్ వేనున్నారు .రేవంత్ రెడ్డి కామారెడ్డి తో పాటు ,కొడంగల్ నియోజకవర్గ నుంచి ఎన్నికల బరిలో దిగబోతున్నారు.ఈ మేరకు కేసిఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచే రేవంత్ రెడ్డి పోటీకి దిగాలని కాంగ్రెస్ పెద్దలు సూచించడంతో ఆయన ఈనెల 8వ తేదీన కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Telugu Congress, Kama, Kodangal, Revanth Reddy, Telangana-Politics

అలాగే ఈ నెల ఆరో తేదీన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నామినేషన్ వేయనున్నారు.కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి దీనికి అనుగుణంగానే పార్టీ కీలక నాయకులతో తాజాగా భేటీ అయ్యారు .ఈ సందర్భంగా కెసిఆర్ ను ఓడించేందుకు ఏమేం చేయాలి ? కాంగ్రెస్ కు బలమున్న ప్రాంతాలు ఏమిటి ?  బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశాలు  ఏమిటి అనే  విషయాలపై  రేవంత్ ఆరాతీస్తూ కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే విధంగా కాంగ్రెస్ గెలుపునకు డొఖా లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Telugu Congress, Kama, Kodangal, Revanth Reddy, Telangana-Politics

 కాంగ్రెస్ నుంచి పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా, కేసిఆర్ ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తుండడంతో ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.దీంతో  ఆయన కు నిజామాబాద్ అర్బన్ నుంచి అవకాశం కల్పించారు. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరో కామారెడ్డి నియోజకవర్గం లో గెలిచేందుకు రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు .అలాగే తన సొంత ప్రాంతమైన కొడంగల్ లోను విజయం సాధించే విధంగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.కెసిఆర్ గజ్వేల్ ,కామారెడ్డిలో రెండు చోట్ల గెలిస్తే కామారెడ్డి అసెంబ్లీ సీటుకు రాజీనామా చేస్తారని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది .ఈ ప్రచారం సక్సెస్ అయితే కెసిఆర్ ఓటమి ఖాయం అనే ధీమాతో రేవంత్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube