జగన్ ప్లాన్స్.. ఆ ముగ్గురు డౌటే ?

వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 టార్గెట్ తో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) లక్ష్యంవైపుగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.అందులో భాగంగానే పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారాయన.

 What Is Wrong With Those Three , Kodali Nani, Ys Jagan, Rk Roja , Ap Politics ,-TeluguStop.com

ఇప్పటికే చాలా నియోజక వర్గాల్లో ఇంచార్జ్ ల మార్పు చేస్తూ వస్తున్నారు.ఇక సీట్ల కేటాయింపులో కూడా కీలక మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

దాదాపు 80 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.ఈ నేపథ్యంలో ఓ ముగ్గురి విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ నడుస్తోంది.

Telugu Ap, Jana Sena, Kodali Nani, Pawan Kalyan, Rk Roja, Ys Jagan-Politics

కొడాలి నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్.వంటి వారికి వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు జరుగుతతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.ఎందుకంటే ఈ ముగ్గురిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.గుడివాడ ఎమ్మెల్యేగా 20 ఏళ్లపాటు కొనసాగిన కొడాలి నాని( Kodali Nani ).మంత్రి పదవిలో ఉన్న సమయంలో ఆయన భాషా విధానంపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి.పైగా ఈసారి నియోజక వర్గంలో కూడా నాని పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు ఇంటర్నల్ టాక్.

అందుకే కొడాలి నానికి ఈసారి గుడివాడ సీటు కష్టమే అంటున్నారు కొందరు రాజకీయ వాదులు.

Telugu Ap, Jana Sena, Kodali Nani, Pawan Kalyan, Rk Roja, Ys Jagan-Politics

అలాగే నగరి నియోజక వర్గంలో ఆర్కే రోజాను కూడా జగన్ పక్కన పెట్టె ఆలోచన చేస్తున్నట్లు టాక్.రోజాపై కూడా ప్రజల్లో వ్యతిరేకత గట్టిగానే కనిపిస్తోంది.అందువల్ల ఈసారి ఆమెకు సీటు నిరాకకరించే అవకాశం ఉందని టాక్.

ఇక ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) పై కూడా చాలా ట్రోల్స్ వైరల్ అయ్యాయి.ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పటికి శాఖ పరంగా ఆయన చేసిందేమి లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

అందుకే ఈసారి ఆయనకు కూడా సీటు కష్టమే అనే టాక్ నడుస్తోంది.మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ పై కన్నేసిన జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకునే ప్లాన్ లో ఉన్నారు, మరి నిజంగానే ఈ ముగ్గురికి సీటు కష్టమేనా ? లేదా మరోసారి వైఎస్ జగన్ ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube