తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఈ కుటుంబంకు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు.
అంతేకాకుండా ఈ కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై స్టార్ హీరోలుగా ఎదిగారు.ఇదిలా ఉంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో విజయశాంతి కూడా అంతే గుర్తింపు ఉంది.
అయితే విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి మధ్య ఓ సంబంధం కూడా ఉందట.
తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న విజయశాంతి గురించి తన నటన గురించి అందరికి తెలిసిందే.
నటిగానే కాకుండా సినీ నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా బాధ్యతలు చేపట్టింది.ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తుంది.
తొలిసారిగా 1979లో భారతీరాజా దర్శకత్వం లో కల్లుక్కుళ్ ఈరమ్ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
అదే ఏడాది కిలాడి కృష్ణుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.
కెరీర్ మొదట్లోనే ఒక ఏడాది 11 సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఎక్కువగా స్టార్ హీరోల సరసన నటించి లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది.ఇక ఈమె నటించిన పాత్రలు మాత్రం ఎంతో గుర్తింపు పొందాయి.డైనమిక్ పాత్రలో లోనే కాకుండా గ్లామరస్ పాత్రలలో కూడా అద్భుతంగా నటించింది విజయశాంతి.
ప్రతిఘటన, స్వయంకృషి, శత్రువు, ఒసేయ్ రాములమ్మ, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, గ్యాంగ్ లీడర్, కర్తవ్యం ఇలా ఎన్నో సినిమాలలో గుర్తిండిపోయే పాత్రలో నటించింది.
ఇక ఈమె భారతీయ నటి, రాజకీయ నాయకురాలు జయలలితకు ఎంతో అభిమానురాలు.
ఇదిలా ఉంటే విజయశాంతి మంచి స్టార్ హోదా ఉన్న సమయంలో మరో సినీ నిర్మాత శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది.ఇక తన భర్త ఎవరో కాదు సీనియర్ ఎన్టీఆర్ పెద్ద అల్లుడు.
గణేష్ రావు కు మేనల్లుడు.అంతేకాకుండా బాలకృష్ణతో మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది.
ఆ ఫ్రెండ్ షిప్ తో బాలకృష్ణతో ఓ సినిమా కూడా నిర్మించాడు.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన నిప్పురవ్వ సినిమాలో హీరోయిన్ గా విజయశాంతిని ఎంచుకున్నారు.ఈ సినిమా సమయంలోనే నిర్మాత శ్రీనివాస్ ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు.
అలా విజయశాంతి భర్త కు నందమూరి కుటుంబానికి మామ అల్లుడు వంటి సంబంధం ఉండగా ఈ విషయం చాలా వరకు ఎవరికీ తెలియదు.14 ఏళ్ల తర్వాత విజయశాంతి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం పలు సినిమాలలో కూడా అవకాశం అందుకుంది.