నల్లగొండ జిల్లా:హిందీయేతర భాషల అణచివేతకు నిరసనగా భారత రాష్ట్రపతికి ప్రజా నేస్తం,తెలుగు భాష ప్రేమికుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహా విజ్ఞాపన పత్రాన్ని బహిరంగ లేఖ రాశారు.
ఉన్నట్టుండి సాధారణ సాంకేతిక ఉన్నత విద్యల బోధనలూ,కేంద్ర ప్రభుత్వ సర్వీసుల ప్రవేశ పరీక్షలూ హిందీలోకి మార్చే తొందరపాటు ప్రయత్నం ఒకటి సాగుతున్నట్లు వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలను,తనలాంటి తెలుగు భాషాభిమానులను మిక్కిలి ఆందోళన కలిగిస్తున్నాయని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,ప్రజానేస్తం,కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న భారత రాష్ట్రపతికి పంపిన మహా విజ్ఞాన లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయం హిందీయేతర భాషా ప్రజలకు,ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు చాల నష్టాన్ని కలుగచేస్తుందని,ఈ నిర్ణయం భారత రాజ్యాంగ స్ఫూర్తికి వక్రీకరణగా ప్రజానేస్తం,తెలుగుజాతి ఆత్మగౌరవ పోరాట యోధుడు బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.అనేక భాషా జాతుల ప్రజలున్న భారతదేశంలో తెలుగుతో సహా 22 భాషలను భారత రాజ్యాంగ చట్టం గుర్తించిందని,హిందీ,ఇంగ్లీషు భాషలను కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు అధికార (Official & Associate Official) భాషలుగా ఉపయోగిస్తున్నారు.
కొంతకాలం తెలుగు మాధ్యమంలో ఉన్నత విద్యను బోధించినప్పటికీ,ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అన్ని స్థాయిల విద్యార్థులు ఎక్కువ శాతం ఇటీవల కాలంలో ఇంగ్లీషు మాధ్యమంలోనే విద్య నేర్చుకుంటున్నారని, ప్రస్తుతం హిందీ భాష గురించి పార్లమెంటరీ స్థాయీ సంఘం తీసుకున్న నిర్ణయం వలన తెలుగు విద్యార్థులకు ఇంగ్లీషు ద్వారా గోడదెబ్బ,హిందీ ద్వారా చెంపదెబ్బ తగిలే పరిస్థితి ఏర్పడుతోందని తెలుగు భాష ప్రేమికుడు,తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రజా పోరాటాల ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న భారత రాష్ట్రపతికి రాసిన మహా విజ్ఞాపన లేఖల ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజాస్వామిక యుగస్పూర్తిని అనుసరించి భాషలన్నీ సమానమైనవే అనే సూత్రీకరణనూ,ఒకనాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన అలాంటి హామీలను పై సిఫారసు పూర్తిగా నిరాకరిస్తోందని తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున భారత రాష్ట్రపతికి రాసిన లేఖల ప్రజా బంధువు బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
ఈ తరహా సిఫార్సులు చేసే ముందు సమస్త భాషల ప్రజల నడుమ చర్జరగాలని,ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజాస్వామికంగా చర్చించి,అసెంబ్లీలలో ఆమోదం పొందాలని,చివరకు భారత పార్లమెంటులో విస్తృతంగా చర్చలు జరిపిన పిదప ఒక ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోవాలని సామాజిక పరివర్తకుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న భారత రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలిపారు.మార్పులు ఏవైనా జరగవలసి ఉంటే క్రింద స్థాయి నుండి పై స్థాయికి ఒక క్రమంలో అమలు జరగాలి తప్ప ఆకస్మిక నిర్ణయాలు చాలామందిని నష్టపరుస్తాయని ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యాదవ్ స్పష్టం చేశారు.
తల్లి భాషలో చదువులను, పరిపాలనను,ప్రవేశ పరీక్షలను తెలుగు భాషాభిమానులుగా మేము స్వాగతిస్తున్నామని బోరన్నగారి నేతాజీ సుభాషన్న రాష్ట్రపతి గారికి పంపిన మహా విజ్ఞాపన లేఖలో తెలిపారు.కేంద్రీయ సర్వీసులలో ప్రవేశ పరీక్షలకు అన్ని గుర్తింపు పొందిన మాతృభాషలకు అవకాశం ఉండాలన్న తెలుగు భాష ప్రేమికుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న,60 ఏళ్లకు పూర్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం హిందీయేతర ప్రాంతాల వారు కోరుకున్నంత కాలం,కేంద్ర -రాష్ట్ర పరిపాలనకు సంధాన భాష (Link Language) గా ఇంగ్లీషు కొనసాగాలని,సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ బోరన్నగారి నేతాజీ సుభాషన్న భారత రాష్ట్రపతికి పంపిన మహా విజ్ఞాపన లేఖలో డిమాండ్ చేశారు.
విద్య నుండి తెలుగు మాధ్యమం (మీడియం)లో చదువులు లేని పరిస్థితి అమలు జరుగుతోందని బోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు.ప్రపంచ వైజ్ఞానిక శాస్త్రాల అధ్యయనానికి తప్పనిసరి అవసరమైన ఇంగ్లీషు భాషను మాతృభాషల ద్వారా నేర్పే నైపుణ్యవంతమైన మంచి సులువు పద్ధతులను అమలు పరచాలని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న భారత రాష్ట్రపతిని కోరారు.
కేంద్రీయ సర్వీసులలోనూ,సంస్థలలోనూ ఆయా భాషల జనాభా దామాషా (proportionate) ప్రాతిపదికన విద్యా,ఉద్యోగ అవకాశాలు ఉండాలని బోరన్నగారి నేతాజీ సుభాషన్న భారత రాష్ట్రపతికి పంపిన లేఖలు విజ్ఞప్తి చేశారు.తెలుగు రాష్ట్రాలలో ఈనాటికీ తెలుగులో పరిపాలన జరగని పరిస్థితిలోనూ,తెలుగు మాధ్యమంలో బోధన లేకపోవడం వల్లనూ కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో,పోటీ పరీక్షలలో,కేంద్రీయ విశ్వవిద్యాలయాల చదువులలో రాణించలేని పరిస్థితి ఏర్పడిందని సుభాషన్న పేర్కొన్నారు.
హిందీ మాతృభాషలో పరీక్షలు రాయగలిగే పోటీదారులతో సమంగా పోటీలో నిలవలేకున్నారని ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఇంగ్లీషు భాషలోనే ఉమ్మడి పరీక్షలు రాసే పద్ధతి ఇంకా కొనసాగాలన్నారు సుభాషన్న.లేకుంటే తెలుగుతో సహా అన్ని భాషల విద్యార్థులకు శిశు విద్యా బోధన కాలము నుండి వారి వారి మాతృభాషల మాధ్యమంలోనే కనీసం ఇంటర్మీడియట్ స్థాయి వరకు బోధించే పద్ధతి మొదట అమలు జరిగేట్లు చూసి,ఆ తర్వాత మాత్రమే పై సూచనలు అమలులోకి తేవాలని ప్రజా నేస్తంభొరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
హిందీ యేతర విద్యార్థులకు పనిగట్టుకుని అననుకూల పరిస్థితులను సృష్టించే పనికి కేంద్ర ప్రభుత్వం పూనుకోకుండా చూడాలని తెలుగు భాష పరిరక్షణ పోరాటయోధుడు,ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న భారత రాష్ట్రపతికి పంపిన మహా విజ్ఞాపన లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుభాషన్న కోరారు.కేంద్ర హోం శాఖా మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్న పార్లమెంటరీ స్థాయి అధికార భాషా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా ప్రజాస్వామిక చర్చల ద్వారా నిర్ణయాలు జరిగేటట్లు చూడమని గౌరవ రాష్ట్రపతికి తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున, తెలుగు భాష ప్రేమికుల తరఫున,ప్రజానేస్తం,తెలుగు భాష పరిరక్షణ ఉద్యమకారుడు సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 భారత రాష్ట్రపతికి రాసిన మహా విజ్ఞాపన లేఖలో విజ్ఞప్తి చేశారు.
భారతీయ భాషలన్నీ సమానమే అనే ప్రజాస్వామిక సూత్రానికి భిన్నంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం హిందీయేతర భాషల పట్ల వివక్ష చూపుతున్నదని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం చూపుతున్న హిందీ పక్షపాత,తెలుగు భాష వ్యతిరేక విధానాలకు నిరసనగా,భారత రాష్ట్రపతికి తెలుగు భాషా అభిమానులు,ప్రజా ఉద్యమకారులు, కవులు,కళాకారులు,రచయితలు,మేధావులు భారత రాష్ట్రపతికి పోస్ట్ కార్డుల ద్వారా లేఖలు పంపాలని సుభాషన్న విజ్ఞప్తి చేశారు.
మాతృభాషపరిరక్షణకు,సరిహద్దులతో నిమిత్తం లేకుండా,కుల, మత,రాజకీయ,ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరి బాధ్యతగా,ప్రతి ఒక్కరి కర్తవ్యంగా స్వీకరించాలని తెలుగు భాషాభిమాన్యుడు,ప్రతి క్షణం ప్రజాహితం కోరుకునే వామపక్ష ప్రజాతంత్ర,అభ్యుదయవాది,తెలుగు భాష ప్రేమికుడు,వాస్తవిక వాది,ఉద్యమకారుడు,సామాజిక పరివర్తకుడు,కుల నిర్మూలన కోసం,మతసామరస్యం కోసం గత మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న నూతన ప్రజాస్వామిక విప్లవకారుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న 8328277285 సమస్త తెలుగుజాతి ప్రజలకు తెలుగు భాష ప్రేమికుడు,మాతృభాష పరిరక్షణ ప్రచారకుడు, అక్షర సైనికుడు సుభాషన్న విజ్ఞప్తి చేశారు.ఇండియా అంటే భారత్ -ఇది రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుందిఅనే వాక్యంతో భారత రాజ్యాంగం ప్రారంభమవుతుంది.
కానీ,ఆచరణలో కేంద్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.దేశమంతా ఒకే భాష,ఒకే సంస్కృతి అనే నినాదంతో హిందీ భాషా సంస్కృతుల్ని మిగతా భాషా జాతులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నదని ప్రజా బంధువు అవార్డు గ్రహీత బోరన్నగారి నేతాజీ సుభాషన్న కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల బోధనలో, జాతీయ స్థాయి ఉద్యోగాల నియామక పరీక్షల్లో హిందీకి ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు ఉదాహరణగా బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.ఇది పైకి భాషకు సంబంధించిన విషయంగా కనిపించినా,వాస్తవానికి ఆధిపత్య స్థాపన కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసే చర్యగా అర్థం చేసుకోవాలని తెలుగుభాష ప్రేమికులకు,మాతృభాషల అభిమానులకు బోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy