భారీ కాయం, బాగా తినే వాడు అని మనం ఎక్కువగా బకాసురుడిని చెప్పుకుంటుంటాం.ఎందుకంటే సాధారణంగా మనం రోజులో ఎంత ఎక్కువగా తినాలనుకున్నా మన పొట్టకు సరిపడా మాత్రమే తినగలం.
అయితే రోజుకు 35 కిలోల ఆహారం ఎవరైనా తినగలరా అంటే ఖచ్చితంగా తినలేరు అని సమాధానం ఇచ్చేస్తాం.ఎందుకంటే మానవ మాత్రులకు అంత భారీగా ఆహారం తినడం సాధ్యం కాదు.
అయితే చరిత్రలో ఓ వ్యక్తి రోజుకు 35 కిలోల ఆహారం తినేవాడు.వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం.
గుజరాత్ ప్రాంతాన్ని పాలించిన మహబూద్ బెగడా అనే సుల్తాన్ రోజుకు ఏకంగా 35 కిలోల ఆహారాన్ని ఆరగించేవాడు.ఈ రాజు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చరిత్రలో ఉన్నాయి.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గుజరాత్ సుల్తాన్ మహమూద్ బెగడ 1511 ప్రాంతంలో పాలించాడు.అతడు హిందువు అయినా ముస్లిం మతం స్వీకరించాడు.ఇక అతడికి చిన్నతనం నుంచి విషం కొద్ది కొద్దిగా స్వీకరించే వాడు.
ఫలితంగా అతడి శరీరం విష తుల్యం అయింది.పొరపాటున ఏదైనా ఈగ అతడి శరీరంపై వాలితే క్షణాల్లో ఆ ఈగ మరణించేది.
ఇక స్త్రీలతో అతడు సంభోగిస్తే, వారికి చుక్కలు కనిపించేవి.ఇక శత్రువులను అతడు విచిత్రంగా హతమార్చేవాడు.
వారిపై ఉమ్మితే చాలు ప్రత్యర్థులు కొద్ది సేపటిలోనే ప్రాణాలు వదిలేసే వారు.అతడి ఉమ్మి అంత విషపూరితమైనదని గ్రంథాల్లో పలువురు పేర్కొన్నారు.
ఇక మహ్ముద-సురత్రానా-కారిత అని పిలువబడే సంస్కృత మహాకావ్యంలో సుల్తాన్ గురించి అద్భుతంగా వర్ణించారు.ఇందులో సుల్తాన్ బలంతో భీమునితో, దాతృత్వంతో కర్ణుడితో, దయలో రాముడితో పోల్చబడ్డాడు.
ఇంద్రునికి సరిసమానంగా అతని ఆస్థాన మహిమ కీర్తించబడేదని తెలుస్తోంది.అతను ఒక రోజులో 150 అరటిపండ్లు తినే వాడని చరిత్ర చెబుతోంది.
రోజుకు 35 కిలోల ఆహారాన్ని దఫదఫాలుగా ఆరగించేవాడని చరిత్రలో పేర్కొన్నారు.ఇక అర్ధరాత్రి సమయంలో పొరపాటుగా ఆకలి వేస్తే తినేందుకు వీలుగా అతడి పడకకు ఇరు వైపులా ఆహారం ఉండేది.
మాంసంతో చేసిన సమోసాలు ఉండేవి.అందుకే ఆహారం తినడంలో సుల్తాన్ మహమూద్ బెగడను చాలా మంది బకాసురుడిగా అభివర్ణిస్తున్నారు.







