వైరల్: మంచుతో ఆడుతున్న ఒంటెని చూడండి... చిన్నపిల్ల అయిపోయింది!

ఒంటె ఓ ఏడారి సాధు జంతువు.అలాంటి ఒంటెకి ఎడారి ఇసుక తప్ప తన జీవితంలో మంచును చూసి ఉండదు.

 Viral Watch The Camel Playing In The Snow The Baby Is Gone , Camel Video, Animal-TeluguStop.com

అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే అలాంటి ఓ ఒంటికి మొదటిసారి మంచు కనబడుతుంది.ఇక అంతే, ఆ క్షణంలో అక్కడి హిమపాతంపై ఒంటె స్పందించిన తీరు మాటల్లో వర్ణించలేనిది.

చిన్న పిల్లలాగా ఆ మంచు ప్రాంతంలో ఆ ఒంటె గెంతులు చూస్తే మనకి కూడా మన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.ప్రస్తుతం ఆ వీడియో సైబర్ ప్రపంచంలో వైరల్ అవుతోంది.

వందలాది జంతువుల కోసం వ్యవసాయ, జంతు అభయారణ్యం అయిన రాంచో గ్రాండే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వెలుగు చూసింది.

కాగా, ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.ఆల్బర్ట్ అనే ఒంటె తొలిసారిగా మంచులోకి ప్రవేశించినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.ప్రపంచంలో వున్న ఆనందం అంతా తాను ఒక్కటే అనుభవించినట్టు ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో చూడండి.

ఒంటె ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది.మంచును చూసిన ఒంటె ఒక్కసారిగా దూకడం, పరిగెత్తడం ప్రారంభిస్తుంది.

మంచును చూసిన ఆనందంలో ఒంటే ఇలా చేసిందని అర్థం చేసుకోవచ్చు.అక్కడ ఒంటెతో పాటు మేకల మంద కూడా ఉంది.

ఇకపోతే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్టు చేస్తూ… ఒక శీర్షిక జోడించారు.దాని సారాంశం ఇలా వుంది.మేము దీన్ని టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా అక్కడ చాలామంది దీన్ని ఇష్టపడినట్లు అనిపించింది.ఆల్బర్ట్ కూడా అదే ఫీల్ అయ్యాడు.కాబట్టి మేము దీన్ని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులతో పంచుకోవాలని భావించాము.అందరూ ఆదరించినందుకు కృతజ్ఞతలు అంటూ… టెక్స్ట్ రాసుకొచ్చారు.

ఇక వీడియో చూసిన నెటిజన్లు అయితే వారి అనుభూతిని కామెంట్స్‌ రూపంలో తెలిజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube