వైరల్: సూసైడ్ చేసుకోబోతున్న మహిళని కాపాడిన తేనెటీగలు..!

ఈ కాలంలో చాలా మంది క్షణికావేశంలో ఎన్నో పొరపాటు నిర్ణయాలను తీసుకుని నిండు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసి ఆత్మహత్య ఒక్కటే దీనికి పరిష్కారం అన్నట్టుగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని సుసైడ్ చేసుకోవాలని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు.

 Viral  The Bees That Saved The Woman Who Was Going To Commit Suicide , Women, Su-TeluguStop.com

పరీక్షలో పాస్ అవ్వలేదని, అమ్మా నాన్న తిట్టారని, మొబైల్ ఇవ్వలేదని, ప్రేమ విఫలం అయిందనె చిన్న చిన్న కారణాల వలన ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి కన్నీటి శోకం మిగులుస్తున్నారు.చిన్న చిన్న కారణాల వలన ప్రాణాలు తీసుకోవడం అనేది సమస్యకు పరిష్కారం కాదు.

ఎన్ని సమస్యలు ఉన్నాగాని మనసు పెట్టి ఆలోచిస్తే ఏ సమస్యకు అయినా పరిస్కారం దొరుకుతుంది.

ఈ క్రమంలోనే ఒక మహిళ కూర్చుని సానుకూలంగా మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే గొడవను ఆత్మహత్య చేసుకునే దాక తీసుకుని వెళ్ళింది.

అయితే ఆత్మహత్య చేసుకోవడం పిచ్చి పని అని మన అందరికి తెలిసిందే.ఇదే విషయం కొన్ని తినేటిగలు కూడా పసిగట్టాయి.ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకోనివ్వకుండా కాపాడాయి.ఏంటి తినేటిగకు ఒక మహిళను కాపాడడం ఏంటి అని అనుకుంటున్నారా.? అసలు వివరాల్లోకి వెళితే.

సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు అనేవి సహజమే.

కానీ కొందరు మాత్రం ఆ గొడవలను సీరియస్ గా తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఇలాంటి కోవకు చెందిన ఒక భార్య భర్తల మధ్య ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది.

కేరళలోని అలప్పుజలో ఉన్న కాయంకులంలో ఇద్దరు భార్య భర్తల మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు వచ్చి గొడవలు కూడా జరిగాయి.దీంతో భార్య మీద విసిగిపోయిన భర్త తన బిడ్డను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

వెంటనే భర్త ఉంటున్న ఇంటి దగ్గరకు భార్య వెళ్లి తన బిడ్డను ఇమ్మని అడిగింది.అయితే ఆమె భర్త ఆమెను ఇంట్లోకి రావడానికి కూడా నిరకరించాడు.

దీంతో ఆమె అక్కడే ఉన్న సెల్ టవర్ ఎక్కి నా బిడ్డను నాకు ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ బెదిరించింది.

దీంతో అక్కడి స్థానికులు భయపడిపోయి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఆమె ఎవరి మాట వినకపోయేసరికి ముందు జాగ్రత్తగా సెల్ టవర్ కింద మెత్తని పరుపులను, చీరలను వల మాదిరిగా ఏర్పాటు చేసారు.ఆ మహిళ ఇంకా సెల్ టవర్ పైకి ఎక్కడంతో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

ఆ మహిళ ఎక్కిన సెల్ టవర్ పైన కొన్ని తేనెటీగలు తేనే పుట్ట పెట్టాయి.అది గమనించని ఆ మహిళ సెల్ టవర్ ఎక్కుతుండగా అది కాస్త ఊగింది.

వెంటనే తేనెటీగలు ఒక్కసారిగా చెలరేగిపోయి ఆ మహిళపై దాడి చేసి ఆమెను కుట్టసాగాయి.ఆ తినేటిగల దాడికి ఆమె భయంతో కిందకు దూకేసింది.ఆమె అదృష్టం ఏంటంటే.ఆమె కింద పడకుండా చీరల మీద పడింది.

ఆ మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటన అనంతరం పోలీసులు ఆమెను, ఆమె భర్తను స్టేషన్ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube