రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.విజయేంద్ర ప్రసాద్ కథల వల్లే రాజమౌళి ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారని చాలామంది భావిస్తారు.
రాజమౌళి సినిమాల కథల విషయంలో విజయేంద్ర ప్రసాద్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
నేను కథలు రాయనని దొంగలిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.రాజ్యసభ పదవికి ఎన్నికైన విజయేంద్ర ప్రసాద్ తాజాగా చేసిన కామెంట్లు చర్చనీయాంశం అవుతున్నాయి.తన దృష్టిలో అబద్ధాలు చెప్పేవాళ్లు మంచి స్టోరీ రైటర్లు అవుతారని ఆయన కామెంట్లు చేశారు.ఏం లేని దాని నుంచి మనం కొత్తగా సృష్టించి ఆసక్తికర అంశంను వెలికితీయడం రైటర్ కు ఉండాల్సిన ముఖ్య లక్షణం అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
అందరినీ మెప్పించే కథలను రాయాలని అయితే ఈ విషయంలో మనం మాత్రం వెనుకబడి ఉన్నామని విజయేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు.కథా రచన అంటే తన ఆలోచనల ప్రకారం అబద్ధాన్ని అందంగా చూపించడం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేను కథలను దొంగలిస్తానని మన రియల్ లైఫ్ లో చాలా కథలు ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
హిస్టరీ నుంచి రామాయణ మహాభారతాల నుంచి చాలా కథలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.నేను రాసే కథలు అక్కడినుంచి తీసుకున్న కథలు అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
విజయేంద్ర ప్రసాద్ ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది.ఇతర భాషల నుంచి కూడా విజయేంద్ర ప్రసాద్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.