రౌడీస్టార్‌ ఖుషి కలెక్షన్స్‌ ని దెబ్బ తీసిన వర్షాలు

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సినిమా( Kushi Movie ) మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు ఈజీగా రాబట్టడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు.

 Vijay Deverakonda And Samantha Kushi Movie Collections,vijay Deverakonda,samanth-TeluguStop.com

కానీ ఈ సినిమా కు వర్షం అడ్డంకిగా మారింది.ఆది వారం మొదలుకుని వరుసగా నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఇలాంటి సమయంలో ఖుషి సినిమా కు కలెక్షన్స్ డౌన్ అయ్యాయి.

వర్షాలు లేకుండా ఉంటే కచ్చితంగా ఇప్పటికే సినిమా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసి ఉండే అవకాశాలు ఉన్నాయి.

Telugu Heavy, Kushi, Mythri Makers, Samantha, Vijay Samantha-Movie

అసలు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Rowdy Star Vijay Deverakonda ) సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కానీ ఖుషి సినిమా కు పాజిటివ్ టాక్ దక్కింది.సమంత( Samantha ) హీరోయిన్‌ గా నటించడం వల్ల కూడా మంచి క్రేజ్ దక్కింది.

అందుకే సినిమా కు భారీ వసూళ్లు నమోదు అవుతాయి అనుకున్నారు.వర్షాల వల్ల మొత్తం తలకిందులు అయింది.

మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ మొత్తం లో సినిమా కోసం ఖర్చు చేశారు.ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఓవర్సీస్ లో ఈ సినిమా అనుకున్న దానికి దాదాపు రెండు రెట్ల వసూళ్లు వచ్చాయి.రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాల కారణంగా గత రెండు రోజులుగా డ్రాప్ అయ్యాయి.

Telugu Heavy, Kushi, Mythri Makers, Samantha, Vijay Samantha-Movie

మళ్లీ వర్షాలు( Heavy Rains ) తగ్గితే తప్ప వసూళ్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.అది ఎంత వరకు సాధ్యం అనేది తెలియాల్సి ఉంది.విజయ్ దేవరకొండ గత చిత్రాల తో పోల్చితే ఈ సినిమా ఫలితం చాలా పాజిటివ్ గా ఉంది.కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయి లో రావడం లేదు అంటూ బయ్యర్లు కూడా అంటున్నారు.

వర్షాల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే చాలా మంది సినిమా ఓటీటీ( Kushi OTT ) లో ఎప్పుడు వస్తుందో చూద్దాం అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube