'అనకొండ' అంటూ ముద్దు పేరు పెట్టేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ !

టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు.

 Vijay Devarakonda And Ananya Pandey Memes Viral In Bollywood, Anakonda, Vijay De-TeluguStop.com

ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.ఈ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన వచ్చింది.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం కాబోతున్నాడు.

ఈ సినిమాలో విజయ్, అనన్య మధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్ లో ఉంటుందని సమాచారం.అనన్య పాండే ఇప్పటికే రెండు హిట్ అందుకుంది.

ఈ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుంది.అయితే ఇప్పుడు అనకొండ టాపిక్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.

అనకొండ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా.అనకొండ అంటే ఫ్యాన్స్ ముద్దుగా పెట్టుకున్న పేరు.షార్ట్ కట్ లో అనన్య పాండే విజయ్ దేవరకొండ.ఈ రెండు పేర్లు కలిపి ఫ్యాన్స్ ముద్దు పేరు పెట్టేసారు.అనన్య లో అన విజయ్ దేవరకొండలో కొండ.రెండింటిని కలిపి అనకొండ అని క్రియేట్ చేసారు.ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ పేరు హాట్ టాపిక్ గా మారిపోయింది.లైగర్ సినిమా సెప్టెంబర్ 9 న విడుదల కాబోతుంది.

విజయ్ తర్వాత సినిమాలో కూడా అనన్య నటిస్తుందని టాక్ వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube