సాధారణంగా మహిళలు పెళ్ళి అయ్యి గర్భం దాల్చిన తర్వాత తొమ్మిది నెలలకు బిడ్డకు జన్మనిచ్చారు.కానీ ఉత్తరప్రదేశ్లో ఓ యువతి తనకు పెళ్లి అయి సరిగ్గా పదిహేడు రోజులకి పండంటి బిడ్డకి జన్మనిచ్చిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని లక్నో ప్రాంతానికి చెందిన ఓ యువతి కి పక్కనే ఉన్నటువంటి కొత్వాలీ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం అయ్యింది.అయితే పెళ్లి జరిగే సమయంలో ఈమె కొంత లావుగా ఉండడంతో బరువు పెరిగిందని అనుకున్నారు పెళ్లి బంధువులు అందరూ.
ఆ తరువాత పెళ్లి అయిన 17 రోజులకి తన కడుపులో నొప్పి రావడంతో తన భర్త చికిత్స నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు.దీంతో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ వైద్యులు ఆమెకు వస్తున్నవి సాధారణ నొప్పులు కాదని పురిటినొప్పులు అని చెప్పారు.
అలాగే అదే సమయంలోనే ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది.
దీంతో ఆ నవ్వు వధువుని పెళ్ళికొడుకు తరపు బంధువులు ప్రశ్నించగా తనపై తన తండ్రి మరియు సోదరుడు కలిపి రోజూ అత్యాచారానికి పాల్పడుతూ ఉండేవారని తెలిపింది.అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు కూడా వారితో కలిసి పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది.ఈ విషయాలు తెలుసుకున్నటువంటి పెళ్ళికొడుకు తరపు బంధువులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని సంప్రదించి వారి పై ఫిర్యాదు నమోదు చేశారు.
అంతేగాక కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన టువంటి తన కన్నతండ్రి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం తో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.