డీయూఐ కేసుల్లో ఇరుక్కున్నారా ఐతే చిక్కులే: యూఎస్‌సీఐఎస్

యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష్ సర్వీసెస్ విడుదల చేసిన కొత్త ఆదేశాల ప్రకారం.రెండు లేదా అంతకంటే ఎక్కువ డీయూఐ (డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్-మద్యం తాగి వాహనం నడపటం) కింద నేరారోపణలు ఉంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వలసదారుల ప్రస్తుత పరిస్ధితిపై ప్రభావం చూపుతుందని తెలియజేసింది.

 Uscis Dui Immigration Applications-TeluguStop.com

డిసెంబర్ 10న యూఎస్‌సీఐఎస్ ప్రచురించిన పాలసీ అలర్ట్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ డీయూఐ నేరారోపణలు వలసదారుడు సమాజం పట్ల ప్రవర్తించే ‘‘నైతిక పాత్ర’’పై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది.ఇది అంతిమంగా వలసదారుడు అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందే ప్రక్రియలో అవరోధాలు ఎదురయ్యేలా చేస్తుందని యూఎస్‌సీఐసీ తెలిపింది.

Telugu Duis Impact, Telugu Nri Ups, Uscis, Visa-

ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా యూఎస్‌సీఐఎస్ న్యాయాధికారులు ఇమ్మిగ్రేషన్ విభాగంలో డీయూఐ కేసులను పరిశీలిస్తారని అందువల్ల ప్రజా భద్రతకు దోహదం చేసినట్లు అవుతుందని డిప్యూటీ డైరెక్టర్ మార్క్ కౌమన్స్ అన్నారు.ఈ నిబంధనలు అక్టోబర్ 25, 2019న తర్వాత దాఖలు చేసిన లేదా పెండింగ్‌లో ఉన్న కేసులకు వర్తిస్తాయని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.

Telugu Duis Impact, Telugu Nri Ups, Uscis, Visa-

కాగా త్వరలో జరగనున్న హెచ్1బీ వీసా లాటరీ కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్ ) ప్రకటించింది.అలాగే 2021 ఆర్ధిక సంవత్సరానికి హెచ్1 క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేయాలనుకునే కంపెనీ/యజమానులు ముందుగా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.అలాగే ప్రతి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌కు 10 అమెరికన్ డాలర్లను రుసుముగా చెల్లించాలని యూఎస్‌సీఐసీ తెలిపిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube