తారక్ తల్లి షాలిని తొలిసారి ఏ సినిమా ఫంక్షన్ కి వచ్చిందో తెలుసా.. ?

తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో యమదొంగ ఒక్కటి.అయితే రాజమౌళి ఫారిన్ టూర్ వెళ్లొచ్చే లోగా విజయేంద్రప్రసాద్ కథ సిద్ధం చేయగా, రత్నం మాటలు రాశారు.

 Unknown Facts About Tarak Mother Shalini And Yamadonga Movie-TeluguStop.com

అయితే రాఖి షూటింగ్ లో ఉన్న తారక్ ని కల్సి,స్టోరీ లైన్ వినిపించడమే కాకుండా బరువు తగ్గాలని కూడా జక్కన్న సూచించారు.ఈ సినిమాలో యముడి గెటప్ కి మోహన్ బాబుని అడిగిన వెంటనే ఆయన ఒకే చెప్పారు.

ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్, మీరా చోప్రా లను సంప్రదించినా, చివరికి ప్రియమణికి అవకాశం వచ్చింది.అయితే సెకండ్ హీరోయిన్ గా మమతా మోహన్ దాస్ అనుకున్నారు.

 Unknown Facts About Tarak Mother Shalini And Yamadonga Movie-తారక్ తల్లి షాలిని తొలిసారి ఏ సినిమా ఫంక్షన్ కి వచ్చిందో తెలుసా.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చిత్రానికి గుణ్ణం ఊర్మిళ,పి చిరంజీవి ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు.ఇరాక్ 2007జనవరి 2న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి,అన్నపూర్ణ స్టూడియో,,రామానాయుడు స్టూడియో ,తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో, అలాగే వికారాబాద్ ఫారెస్ట్ కొన్ని సీన్స్ తీసి,రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేశారు.300మంది 2నెలలు శ్రమించి యమలోకం సెట్ వేసారు.

అయితే సెట్ లో సెంథిల్ కుమార్ 400టన్నుల లైటింగ్ ఉపయోగించారంట.ఇక ఏమంటివి ఏమంటివి డైలాగ్ కంఠస్థం చేసి, సింగిల్ టేక్ లో తారక్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు.అయితే ఈ సినిమాలో విశ్వామిత్రుని వేషం ప్రభాస్ వేస్తున్నాడని టాక్ వినిపించింది.

కాగా.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు,దర్శక రత్న దాసరి నారాయణరావు లాంటి మహామహులంతా ఆడియో ఫంక్షన్ కి వచ్చారంట.

ఇక తారక్ తల్లి తొలిసారి హాజరైన వేడుక అదేకావడంతో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.అయితే మోహన్ బాబు మరో హైలెట్ గా నిలిచింది.

అంతేకాక.హీరోయిన్స్ గ్లామర్ ,సాంగ్స్ అన్నీ హిట్ అందుకున్నాయి.

ఇక సినిమా మొదటి వారం 15కోట్ల షేర్ కలెక్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ సినిమా సంగతి అందరికి తెలిసిందే.

#Audio Function #Rajamouli #Mohan Babu #Shalini #UnknownFacts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు