సూపర్ : అక్కడ కడుపు నిండా తిని సగం బిల్లు మాత్రమే కట్టమంటున్న ప్రభుత్వం...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించడంతో పలు దేశ ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఇలాంటి దేశాల్లో యూనైటెడ్ కింగ్ డమ్ ఒకటి.

 50 Percent Offer, United Kingdom,  Government, Food Items, Britain-TeluguStop.com

 దీంతో మళ్లీ తమ ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచుకునేందుకు యునైటెడ్ కింగ్ డమ్ ప్రభుత్వ అధికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.ఇందులో భాగంగా ప్రజలకు ఆఫర్ల వెల్లువ కురిపిస్తున్నారు.

అయితే యునైటెడ్ కింగ్ డమ్ లో ఆహార పదార్థాలకు పెట్టింది పేరు.అందువల్ల ఆహార ప్రియులకు ఆ దేశ ప్రభుత్వం ఓ మంచి శుభవార్త చెప్పింది.అయితే ఇందులో పలు హోటళ్లు మరియు రెస్టారెంట్లలో కడుపు నిండా ఆహారం తిని కేవలం 50 శాతం బిల్లు మాత్రమే చెల్లించవచ్చని ఆఫర్ ని ప్రకటించింది.అయితే ఈ  ఆఫర్లు వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది.

ఇందులో సోమ, మంగళ, బుధవారాల్లో ఈ ఆఫర్ అందరికీ వర్తిస్తుంది.దీంతో ఆహార ప్రియులు పండగ చేసుకుంటున్నారు.

కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.దీంతో కొంత మంది భారతీయులు ఇలాంటి ఆఫర్లను భారతదేశంలో కూడా  ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి మోడీ సర్కార్ ఈ విషయంపై ఏమంటుందో చూడాలి.

అయితే ఈ ఆఫర్ల గురించి కొంత మంది ఆర్థిక నిపుణులు స్పందిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాలంటే దేశంలోని సొంత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడంతో మంచి ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక ఇలాంటి వాటి వల్ల దేశీయ ఉత్పత్తులకు గిరాకీ పెరగడమే కాకుండా, ఆర్థికంగా స్థిరపడవచ్చని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube