నేడు ప్రధాని మోదీ( Narendra Modi ) అధ్యక్షతన కొత్త పార్లమెంటు భవనంలో క్యాబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎన్నో దశాబ్దాలు ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
దీంతో పార్లమెంట్, అసెంబ్లీ లలో 33% వారికి రిజర్వేషన్లు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇదిలా ఉంటే రేపటినుండి కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు జరగనున్నాయి.
ఈ కొత్త పార్లమెంటు సమావేశాలలో మొదట ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయబోతున్నారట.పార్లమెంట్ ఇంకా రాజ్యసభలలో కేంద్ర ప్రభుత్వానికి( Central Govt ) తగ్గిన బలం ఉండటంతో ఈ బిల్లు.
ఆమోదం పొందుకోబోతున్నట్లు సమాచారం.
ఎన్నో దశాబ్దాల నుండి మహిళా రిజర్వేషన్ బిల్లు( Womens Reservation Bill )ను తీసుకురావడానికి అనేక ప్రభుత్వాలు పార్టీలు కృషి చేశాయి.
అయితే ఎట్టకేలకు కొత్త పార్లమెంటు భవనంలో ఈ బిల్లుకు ఆమోదం లభించనుంది.దీంతో చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నట్లు తెలుస్తోంది.చట్టసభలలో పురుషుల ఆధిపత్యం ఎక్కువ కావడంతో గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం జరిగాయి.ఈ క్రమంలో కేంద్ర క్యాబినెట్ ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.