ట్రంప్ “అధికార దుర్వినియోగి” కాదు..తేల్చేసిన సెనేట్..!!

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఉన్న అభిశంసన తీర్మానం గురించి అందరికి తెలిసిందే.సెనేట్ లో అభిశంసన పై వాదనలు జరిగాయి…గత సంవత్సరం డిసెంబర్ లో ఈ అభిశంసన ప్రక్రియ మొదలైంది.

 Trump Is Not An Abuse Of Power-TeluguStop.com

అయితే ముందుగా తీర్మాన ప్రవేశ పెట్టిన డెమోక్రట్లు, వారి అధిక మెజారిటీ కారణంగా, ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందింది.తరువాత ఈ ప్రక్రియ సెనేట్ కు వచ్చింది.

ఇక్కడ రిపబ్లికన్ ల కి ఉన్న మెజారిటీ వల్ల అభిశంసన ముందుకు వెళ్ళదని తెలిసినా, సెనేట్ లో ఎన్నో వాదనలు జరిగాయి…ఈ క్రమంలోనే.

Telugu Americadonald, America, Democarticjoy, Donaldtrump, Republicans, Trump, T

అంచనాల మేరకు రిపబ్లికన్ లు ఇచ్చిన భారీ మద్దతుతో ట్రంప్ అభిశంసన నుంచీ బయటపడ్డారు.ట్రంప్ ను సెనేట్ నిర్దోషిగా తీర్మానించింది.రెండు అభియోగాల కారణంగా ఈ అభిశంసన జరుగగా, అధికార దుర్వినియోగం చేశారన్న అభియోగం లో ట్రంప్ కు వ్యతిరేకంగా 48 ఓట్లు పడగా, మద్దతుగా 52 మంది ఓటు వేశారు.

ఇక అమెరికన్ కాంగ్రెస్ విధులకు ఆటంకం కలిగించారనే రెండో అభియోగం లో 53-47 ఓట్లు తేడాతో ట్రంప్ సేఫ్ జోన్ లో నిలుచున్నారు.ఈ విధంగా పదవిని పదిలం చేసుకున్నారు.

అయితే.

Telugu Americadonald, America, Democarticjoy, Donaldtrump, Republicans, Trump, T

రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు, డెమోక్రటిక్ పార్టీ నేత జోయ్ బిడెన్ గట్టి పోటీ ఇవ్వనున్నారు.ఈ నేపధ్యంలోనే ట్రంప్ ఉక్రెయిన్ సాయం కోరూతూ, ఆయన్ని దెబ్బ తీసేందుకు, జోయ్ బిడెన్ , అతని కుమారుడిపై అవినీతి కేసు దర్యాప్తు విషయమై ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకువచ్చారని ఈ అభిశంసన తీర్మానం పెట్టారు డెమోక్రట్లు.కానీ సెనేట్ లో ఈ అభియోగాలకు తగిన ఓట్లు రాకపోవడంతో ట్రంప్ ను నిర్దోషిగా సెనేట్ తీర్మానించింది.

అయితే ఈ విషయమై రేపు అధికారికంగా స్పందిస్తాను అంటూ ట్విట్టర్ ద్వార ట్రంప్ ప్రకటించారు.ఇలా అధ్యక్ష పదవిలో అభిశంసన ఎదురుకొని బయటపడిన వారిలో ట్రంప్ 3వ వ్యక్తి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube