బీజేపీ లోకి టీఆర్ఎస్ అసంతృప్తులు ? ముహూర్తం ఎప్పుడంటే ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్, కేంద్ర అధికార పార్టీ బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది.ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలే చేస్తోంది.అందుకే టిఆర్ఎస్ కు ఎప్పటికప్పుడు చెక్ పెట్టే విధంగా తెలంగాణ బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.2023 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బిజెపి నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.నిత్యం ప్రజా సమస్యలపై బిజెపి నేతలు పోరాటాలు చేస్తూ.పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే పార్టీలోకి చేరికలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా టిఆర్ఎస్ అసంతృప్త నేతలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వారందరినీ పార్టీలోకి చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.

 Trs Leaders To Join Bjp In Telangana, Trs, Telangana, Bjp, Telangana Government,-TeluguStop.com

జూలై 2 ,3 తేదీల్లో హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు బిజెపి ప్లాన్ చేస్తోంది.ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు.

ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సమయంలోనే అసంతృప్త నేతలను భారీగా చేర్చుకుని ఆ పార్టీకి షాక్ ఇవ్వడంతో పాటు, తన గ్రాఫ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారట.


Telugu Amith Sha, Bandi Sanjay, Modhi, Prime India, Telangana, Telangana Bjp-Pol

టిఆర్ఎస్ లో ఉన్న ప్రజాదరణ కలిగిన నాయకులకు పదవులు దక్కక చాలాకాలం నుంచి అసంతృప్తితో ఉన్నారు.ఇప్పుడు అటువంటి వారందరినీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బిజెపి బలోపేతమవుతుందని తెలంగాణ బిజెపి నాయకులు బలంగా నమ్ముతున్నారు.అందుకే చేరికలపైనే ఎక్కువగా ఫోకస్ పెంచారు.ఇదిలా ఉంటే బీజేపీ ఎత్తుగడలను పసిగట్టిన టీఆర్ఎస్ పార్టీ మారే ఆలోచనలో ఎవరెవరున్నారు ? ఎందుకు బీజేపీ లో చేరుతున్నారు అనే విషయంపై ఆరా తీస్తూ.వారు బిజెపి లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube