హిందూ శాస్త్రం ప్రకారం 5 చెట్లు పూజిస్తే.. కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము.ఈ క్రమంలోనే ఆ వృక్షాలకు ఎంతో భక్తిశ్రద్ధలతో నిష్టనియమాలతో పూజలు చేస్తుంటారు.

 Trees Significance And Puja Benefits Ravi Tree, Banana Tree, Money Plant, Pooja-TeluguStop.com

సాక్షాత్తు ఆ వృక్షాలను దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు చేయడం మనం చూస్తున్నాము మరి ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఈ 5 రకాల వృక్షాలకు భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.మరి ఐదు రకాల చెట్లు ఏవి? వాటిని ఏ విధంగా పూజించాలి? వాటిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతి ఇంటి ఆవరణంలో ఉండి నిత్య పూజలను అందుకుంటున్న తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.తులసి చెట్టు కింద ప్రతి రోజూ నెయ్యి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెంది మన ఇంట్లో సంపదను పెంచుతుంది.అయితే లక్ష్మీదేవికి ప్రతిరోజు ఉదయం నీరు పోసి పూజ చేయాలి కానీ ఆదివారం మాత్రం నీరు పోయకూడదు.

అలాగే ఏకాదశి తిథి రోజు తులసి ఆకులను తుంచడం చేయకూడదు.

జమ్మి వృక్షాన్ని కూడా హిందువులు దైవ సమానంగా భావిస్తారు.

ఈ క్రమంలోనే ప్రతిరోజు సాయంత్రం జమ్మి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల సంపద అభివృద్ధికి లోటు ఉండదు.వ్యాపార రంగంలో కూడా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు.

ఇలా ప్రతిరోజు సాయంత్రం జమ్మి చెట్టు కింద నువ్వుల నూనె దీపారాధన ఎంతో మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు.ఇక శనివారం జమ్మి చెట్టుకింద ఆవ నూనెతో దీపారాధన చేయడం వల్ల శని ప్రభావం దోషాలు తొలగిపోతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దగ్గర మనీ ప్లాంట్ పెంచుకోవడం ఎంతో ముఖ్యం.మనీ ప్లాంట్ ఇంటి ఆవరణంలో ఉండటంవల్ల మన ఇంట్లోకి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవహింపకుండా చేస్తుంది.అదేవిధంగా మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల సంపద కలుగుతుందని భావిస్తారు.

రావిచెట్టును కూడా హిందువులు ఎంతో పవిత్రమైన వృక్షంగా భావిస్తారు.సకల దేవతలు రావిచెట్టులో అణువణువునా కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.అదేవిధంగా పితృదేవతలు రావి చెట్టు పై కొలువై ఉంటారని మనం రావిచెట్టుకు నమస్కరించడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ప్రతి శనివారం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.

అరటి చెట్టును కూడా ఎంతో పవిత్రమైన వృక్షంగా భావిస్తాము.అరటి చెట్టును గురువారం పూజించడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయి.ప్రతి గురువారం కొందరు ఉపవాసంతో అరటి చెట్టుకు నీళ్లు పోసి మినపప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తుంటారు.

ఈ విధంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఐదు వృక్షాలను ఎంతో పవిత్రమైన వృక్షాలుగా భావించి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube