టాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద ముందెన్నడు చూడని కొత్త జోడీల సందడి..

Tollywood New Couples Who Are Going To Romance, Tollywood, New Couples , Romance, Balakrishna, Shruti Haasan, Lakshmi Roy, Nagarjuna, Sonakshi Sinha, Bangarraju,akhanda, Pawan Kalyan, Pooja Hegde, Hari Hara Veeramallu, Harish Shankar, Kalyan Krishna, Boyapati, Gopicand Malineni

గత ఏడాదిగా కరోనా దెబ్బకు కుదేలైన తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడుతోంది.ప్రస్తుతం కరోనా కల్లోలం కొనసాగుతున్నా.

 Tollywood New Couples Who Are Going To Romance, Tollywood, New Couples , Romance-TeluguStop.com

తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేయటానికి పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి.టాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద కొత్త జోడీలు మెరవబోతున్నాయి.ఎవ్వరూ ఊహించని ఈ నయా కాంబోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాలకృష్ణ


నందమూరి నట సింహం బాలకృష్ణ.బోయపాటి దర్శకత్వంలో అఖండ మూవీ చేస్తున్నారు.మరోవైపు మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ భారీ కమర్షియల్‌ సినిమాకి రెడీ అయ్యాడు.మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మాస్తోంది.వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న కథతో ఈ సినిమా రెడీ అవుతోంది.

ఈ చిత్రంలో నందమూరి అందగాడి సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే శృతి హాసన్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.మరో హీరోయిన్ గా రాయ్ లక్ష్మీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

నాగార్జున


Telugu Akhanda, Balakrishna, Bangarraju, Boyapati, Harihara, Harish Shankar, Kal

తాజాగా విడుదల అయిన వైల్డ్‌ డాగ్‌ సినిమాతో మంచి హిట్ కొట్టాడు నాగార్జున.ప్రేక్షకులను బాగా అలరించాడు కూడా.ప్రస్తుతం ఆయన బంగార్రాజు సినిమాపై ఫుల్ ఫోకస్ చేశాడు.

సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది.ఈ సినిమాలో నాగార్జున సరసన బాలీవుడ్‌ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

సోగ్గాడే.దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది.

పవన్ కల్యాణ్


Telugu Akhanda, Balakrishna, Bangarraju, Boyapati, Harihara, Harish Shankar, Kal

రీసెంట్ గా రిలీజ్ అయిన వకీల్ సాబ్ తో అదరగొట్టిన పవన్ కల్యాణ్.ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు.దీంతో పాటు అయ్యప్పయున్‌ కోషియున్‌ రీమేక్‌ సినిమాతో బిజీగా ఉన్నారు.వీటితో పాటు హరీష్‌ శంకర్‌తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో పవన్‌ తో కలిసి పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube