టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మల్లో తమన్నా ( Tamannaah Bhatia, )మరియు రకుల్ ప్రీత్ సింగ్( Rakul preeth singh ) ముఖ్యులు అనడంలో సందేహం లేదు.ఇప్పటికి కూడా వీరిద్దరు ఏదో ఒక విధంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు.
ఇదే సమయంలో వీరిద్దరి యొక్క అందాల ఆరబోత గురించి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది.సోషల్ మీడియా లో వీరిద్దరు సౌత్ కి లేదా నార్త్ కి పరిమితం అవ్వకుండా పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేస్తూ ఉంటారు.
వీరి యొక్క హాట్ ఫోటో షూట్స్ అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే.వీరి యొక్క స్టార్ డమ్ నేపథ్యం లో వీరి ప్రేమ కథ ల గురించి మీడియా లో ప్రధానంగా చర్చ జరుగుతూనే ఉంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్ గత కొన్నాళ్లుగా జాకీ భగ్నా( JACKKY BHAGNANI )నీ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.ఇక తమన్నా ఇటీవలే విజయ్ వర్మ( Vijay Varma ) తో ప్రేమలో పడింది.తమన్నా అంతకు ముందు ఒక హీరో తో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి.కానీ అవి నిజం కాదని.అతడికి అప్పటికే పెళ్లి అయ్యిందని తేలిపోయింది.అవి పుకార్లే కానీ ఈసారి మాత్రం విజయ్ వర్మ తో ఈ అమ్మడి యొక్క ప్రేమ వ్యవహారం నిజం.
గతంలో పుకార్లు షికార్లు చేసినా కూడా ఇప్పుడు మాత్రం అలాంటివి ఎక్కువ లేకుండా ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి డీసెంట్ గానే ప్రచారం జరుగుతోంది.
ఇద్దరు కూడా పెళ్లి కి సిద్ధం అవుతున్నారు.ఎప్పుడెప్పుడు వీరి పెళ్లి చేద్దామా అంటూ కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేస్తున్నారు అంటున్నారు.ఇక రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ వ్యవహారం గురించి అనుమానాలు వ్యక్తం చేసే వారు ఉన్నారు.
జాకీ భగ్నాని తో చాలా తక్కువగా రకుల్ కనిపిస్తూ ఉంటుంది.దాంతో అసలు వీరిద్దరు ప్రేమలో ఉన్నారా… పెళ్లి చేసుకుంటారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే రకుల్ అభిమానులు మరియు సన్నిహితులు మాత్రం జాకీ భగ్నాని తో ఆమె ప్రేమ చాలా బలమైనది.ఇద్దరి మధ్య బంధం కచ్చితంగా పెళ్లి బంధంగా మారుతుందని పేర్కొన్నారు.