టాలీవుడ్ లో హీరోయిన్ కష్టాలు.. పాపం హీరోలు?

ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.ప్రస్తుతం కేవలం ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు మాత్రమే స్టార్ హీరోయిన్లు గా చలామణి అవుతున్నారు.

 Tollywood Heroes Who Are Waiting For Heroines Prabhas Chiranjeevi Ntr Ram Charan-TeluguStop.com

స్టార్ హీరో సినిమా ఏదైనా తెర మీదికి వస్తే ఒక వీళ్ళలో ఒక్కరికి హీరోయిన్ గా ఫిక్స్ చేస్తున్నారు.దీంతో హీరోయిన్లు ప్రస్తుతం ఫుల్ బిజీ అయిపోయారు.

ప్రస్తుతం హీరోలు ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేయాలని అనుకున్నప్పటికీ హీరోయిన్ల కొరత మాత్రం హీరోల స్పీడ్ కి పుల్ స్టాప్ పెట్టేస్తోంది అన్నది తెలుస్తుంది.

కాగా ప్రస్తుతం హీరోయిన్ల కోసం వెయిట్ చేస్తున్న హీరోలు ఎవరో తెలుసుకుందాం… పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ వరుసగా ఐదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

నాలుగు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతూ ఉండటం గమనార్హం.కానీ కొన్ని సినిమాలు ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు.

సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో సినిమాకి ఇంకా హీరోయిన్ కోసం వెతుకుతున్నారట.

మొన్నటి వరకూ జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాకే పరిమితమైన ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన రెండు సినిమాలకు హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు.పూజా హెగ్డే జాన్వికపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నాయ్.అలియా భట్ ఫిక్స్ అయిపోయిందనే  వార్తలు కూడా వచ్చాయి.ఇలా ఎన్టీఆర్ కు కూడా హీరోయిన్ కష్టాలు తప్పడం లేదు.

ఇప్పటికే త్రిబుల్ ఆర్ కంప్లీట్ చేసిన రామ్ చరణ్ శంకర్ తో ఒక సినిమాతో బిజీగా ఉన్నాడు.అదే సమయంలో తండ్రితో కలిసి నటించిన ఆచార్య సినిమా విడుదల పనిలో నిమగ్నమయ్యాడు.శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలో కియారా అద్వానీ ఫైనల్ చేసారు.కానీ ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన సినిమాలో మాత్రం హీరోయిన్ కష్టాలు తప్పటం లేదట.

విజయ్ దేవరకొండకు హీరోయిన్ కష్టాలు తప్పడం లేదు.సుకుమార్తో అనౌన్స్ చేసిన ఈ సినిమా కోసం హీరోయిన్ కోసం వెతుకుతున్నారట.అంతేకాకుండా పూరి జగన్నాథ్ తో చేయబోయే సినిమా జనగణమన సినిమాకు కూడా ఇంకా హీరోయిన్ ఫిక్స్ చేయాల్సి ఉంది.

జూనియర్ హీరోల పరిస్థితి ఇలా ఉంటే.సీనియర్ హీరోల పరిస్థితి మరోలా ఉంది.ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్న చిరంజీవి 5 సినిమాలు కమిట్ అయ్యాడు.

అయితే బాబి, వెంకీ కుడుముల సినిమాలకు ఎంత వెతికినా చిరంజీవి కి సూటయ్యే హీరోయిన్లు దొరకడం లేదట.పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోయే సినిమాకు కూడా హీరోయిన్ కష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది.

ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ల కోసం స్టార్ హీరోలు వెయిట్ చేస్తూ సినిమాలను లేట్ గా ప్రారంభిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube