మొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో అందరినీ ఉర్రూతలూగించే మాస్ సాంగ్స్.స్పీడ్ గా ఉండి అర్థం కాని సాంగ్స్ ఎక్కువగా కనిపించేది.
కానీ ఇప్పుడు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మెలోడీ సాంగ్స్ బాగా హిట్ అయిపోతున్నాయి.ఇటీవలి కాలంలో ప్రతి సినిమాలో ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది.
కాగా ఆ సినిమా మొత్తానికి ఆ మెలోడీ సాంగ్ ప్రాణం పోస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.చిన్న సినిమాలకు సైతం ఇలాంటి మెలోడీ సాంగ్స్ ఊహించని హైప్ తీసుకు వస్తూ ఉంటాయి.
ఇటీవలి కాలంలో మెలోడీ సాంగ్స్ ట్రెండ్ తెలుగు చిత్రపరిచయం లో నడుస్తుంది.మరి ఏ సినిమాలో ఏ మెలోడీస్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్ పూజ హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన రాదే శ్యామ్ సినిమాకు సంబంధించి ఇటీవలే ఈ రాతలే అనే పాట విడుదలైంది.ఈ సినిమా ఒక రొమాంటిక్ హిస్టారికల్ స్టోరీ లవ్ స్టోరీ అన్న విషయం తెలిసిందే.
ఇందులో ఈరాతలే లాంటి మెలోడీ సాంగ్ ఉండడంతో ఇక ఈ సినిమాపై మరింత హైప్ పెరిగి పోయింది.ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట సినిమాలో కూడా ఇటీవలే కళావతి పాట విడుదలై ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది.ఈ పాటలో మహేష్ డాన్స్ కూడా బాగుంది.
ఇటీవలే పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పాత్రకు భార్య పాత్రలో నిత్యా మీనన్ నటించింది. ఈ రెండు పాత్రల మధ్య మధ్య కెమిస్ట్రీ తెలిపేందుకు అంత ఇష్టమేందయ్యా నీకు అనే ఒక ఫీల్‌గుడ్ సాంగ్ యూత్ అందరికీ తెగ ఆకర్షిస్తోంది.
ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో సక్సెస్ అందు కోవడానికి ఎదురుచూస్తున్నా శర్వానంద్ సినిమాలో కూడా ఇలాంటి ఒక ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.హీరోయిన్ ను వర్ణిస్తూ సాగే ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.అయితే ఇటీవల కాలంలో సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తున్న మెలోడీ సాంగ్స్ అని పాడుతున్నది.
సిద్ శ్రీరామ్ కావడం గమనార్హం.అతడి వాయిస్ వినిపించింది అంటే చాలు నేటి రోజుల్లో తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఉర్రూతలూగి పోతున్నారు.