పీఎం-కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్‌ ఫీచర్‌ రైతులకు ఇలా ఉపయోగపడుతుంది!

పీఎం-కిసాన్ పధకం( PM-Kisan Scheme ) గురించి ఇక్కడ ప్రతిఒక్కరికీ తెలిసినదే.పంట పెట్టుబడి సహాయం కోసం దేశంలోని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో కేంద్రం పీఎం-కిసాన్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి అందరికీ విదితమే.

 This Is How Face Authentication Feature In Pm-kisan App Is Useful For Farmers, F-TeluguStop.com

ప్రధాని మోదీ( Prime Minister Modi ) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఎంతో మేలు చేకూర్చింది.ఈ స్కీమ్‌ ద్వారా అర్హత కలిగిన వారందరికీ సులువుగా లబ్ధి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే పీఎం-కిసాన్ యాప్‌లో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది.దీంతో ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న మొదటి కేంద్ర సంక్షేమ కార్యక్రమంగా పీఎం కిసాన్‌ నిలిచింది.

Telugu Agricultural, Face, Farmers, Pm Kisan, Pm Kisan App-Latest News - Telugu

ఇప్పుడు లబ్ధిదారులైన రైతులు పీఎం కిసాన్, తమ మొబైల్ డివైజ్‌లలో ముఖాలను స్కాన్ చేయడం ద్వారా ఈజీగా e-KYC ప్రాసెస్‌ని కంప్లీట్‌ చేసుకోవచ్చు.ముఖ్యంగా వృద్ధులకు ప్రాసెస్‌ను సులభతరం చేసే లక్ష్యంతో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు భోగట్టా.ఇక ఈ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ ఎలా పని పనిచేస్తుందంటే రైతులు తమ మొబైల్ డివైజ్‌లలో( mobile devices ) ఫేషియల్ స్కానింగ్‌ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్‌ కంప్లీట్‌ చేయవచ్చు.మొబైల్ నంబర్లను తమ ఆధార్ కార్డ్‌లకు లింక్ చేయని వృద్ధ రైతులకు ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

లబ్ధిదారులందరికీ యాక్సెసబిలిటీ, కన్వీనియన్స్‌ అందిస్తుంది.

Telugu Agricultural, Face, Farmers, Pm Kisan, Pm Kisan App-Latest News - Telugu

గతంలో PM-కిసాన్ లబ్ధిదారులు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌( Biometric Verification ) లేదా వారి రిజిస్డర్డ్‌ మొబైల్ నంబర్లకు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్‌ ద్వారా e-KYC చేయించుకోవాల్సి ఉండేది.ఆధార్‌తో లింక్‌ కాని మొబైల్‌ నంబర్లు, వెరిఫికేషన్‌ సెంటర్లకు చేరుకోవడంలో ఇబ్బందులు రైతులకు సమస్యగా ఉండేది.ఇపుడు ఈ ఫేషియల్‌ అథెంటికేషన్‌ ఇలాంటి అడ్డంకులను తొలగించనుంది.

ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్ రైతుల ఆధార్ కార్డుల నుంచి ఐరిస్ డేటాను ఉపయోగించుకుంటుంది.ఇకపోతే పీఎం-కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్‌ ఫీచర్ గురించి ఇంకా ఎవరికీ తెలియకపోతే దానిని మీ దగ్గర వున్న రైతులకు సవివరంగా తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube