జీడిమెట్లలో రూ.4 కోట్లతో టిష్యూ కల్చర్ ప్రయోగశాల నిర్మాణ పనులకు శంఖుస్థాపన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్లలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.4 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న టిష్యూ కల్చర్ ప్రయోగశాల నిర్మాణ పనులకు ఈరోజు రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, సహకార & మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ కొండబాల కోటేశ్వర రావు గారు, భారత ప్రభుత్వ రైతు సంక్షేమం, వ్యవసాయ శాఖ ( సీడ్స్ ) సంయుక్త కార్యదర్శి డా.విజయలక్ష్మీ నాదెండ్ల ( ఐఎఎస్ ) గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ హనుమంత్ కే.జెండగే ( ఐఎఎస్ ) గారు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.కే.కేశవులు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని శంఖుస్థాపన చేశారు.

 Foundation Stone Laid For Construction Of Tissue Culture Laboratory At Jeedimetl-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిష్యూ కల్చర్ ప్రయోగశాల ప్రభుత్వ రంగంలో ఇదే తొలిసారి అని అన్నారు.టిష్యూ కల్చర్ ప్రయోగశాల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, మొక్కల పెంపకానికి మరియు మొక్కల పునరుత్పత్తికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

Telugu Cost Rs Crore, Stone, Jeedimetla, Malla, Tissue-Latest News - Telugu

పండ్లు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, చెక్క మొక్కలు, అలంకారాలు, జీవ ఇందనం వంటి మొక్కలను ఈ ప్రయోగశాల ద్వారా తయారు చేసి తెలంగాణ రాష్ట్ర రైతులకు మరియు హరితహారం కార్యక్రమంలో అందుబాటులో ఉంచేందుకు వీలుగా దోహదపడుతుందని చెప్పారు.

అదేవిధంగా ఈ ప్రయోగశాల ద్వారా ఒక చిన్న కణజాలం లేదా మొక్కల కణాల నుండి మొత్తం మొక్కను పునరుత్పత్తి చేయవచ్చని ఈ మొక్కలు తల్లి మొక్క యొక్క నిజమైన లక్షణాలను కలిగి ఉంటాయని అన్నారు.

Telugu Cost Rs Crore, Stone, Jeedimetla, Malla, Tissue-Latest News - Telugu

సాంప్రదాయ మొక్కల కంటే టిష్యూ కల్చర్ ద్వారా పెరిగిన మొక్కలు శక్తివంతమైనవని, వేగంగా పెరుగుతాయని, ఎక్కువ రెట్లు ఒకే విధమైన మంచి లక్షణాలు కలిగి ఉంటాయని, వ్యాధులు/వ్యాధికారకాలు ఉండవని మరియు మంచి దిగుబడినిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ జే.శ్రీనివాస్, జీడిమెట్ల ఇంజినీరింగ్ మేనేజర్ ఆర్.నర్సింహా రెడ్డి, జీడిమెట్ల ఆర్ఎం కే.కోటి లింగం, ఇతర అధికారులు రవీందర్ రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube