డిజిటల్ మార్కెటింగ్( Digital Marketing ) అనేది భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న రంగం.ఇందులో మంచి స్కిల్స్ ఉన్న వ్యక్తుల కోసం అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా డిమాండ్ ఉన్న ఉద్యోగాలలో కంటెంట్ రైటర్,( Content Writer ) ఆన్లైన్ ట్యూటర్,( Online Tutor ) ఆన్లైన్ సర్వే, డేటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ మీడియా మేనేజర్ ఉన్నాయి.అద్భుతమైన స్కిల్స్ ఉంటే ఈ ఉద్యోగాల ద్వారా డైలీ కొద్ది గంటల పని చేసి లక్షల్లో జీతం పొందవచ్చు.
కంటెంట్ రైటర్ జాబ్ చేయాలనుకునేవారు వెబ్సైట్లు, బ్లాగులు, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల కోసం కంటెంట్‌ను చాలా క్రియేటివ్ గా రాసి ఇవ్వాలి.వారికి బలమైన రైటింగ్ స్కిల్స్( Writing Skills ) ఉండాలి.ఏ భాషలో జాబ్ చేస్తే ఆ భాష పై వారికి మంచి నైపుణ్యం ఉండాలి.ఇక ఆన్లైన్ ట్యూటర్లు విద్యార్థులకు ఆన్లైన్లో టీచ్ చేస్తూ బాగా డబ్బు సంపాదించొచ్చు.
మాథ్స్, సైన్స్ నుంచి ఇంగ్లీష్ వంటి లాంగ్వేజెస్ అనేక సబ్జెక్టులను టీచ్ చేయవచ్చు.బాగా డబ్బు సంపాదించొచ్చు.
ఆన్లైన్ సర్వే,( Online Survey ) డేటా ఎంట్రీ ఆపరేటర్లు( Data Entry Operator ) కూడా డీసెంట్ శాలరీ సంపాదించొచ్చు.వీరు వ్యాపారాల కోసం డేటాను సేకరించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.వారికి మంచి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది.సోషల్ మీడియా మేనేజర్లు కంపెనీ సోషల్ మీడియా అకౌంట్స్ మైంటైన్ చేస్తుంటారు.వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మంచి అవగాహన కలిగి ఉండాలి, లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి వాటిని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి.డిజిటల్ మార్కెటింగ్‌లో అందుబాటులో ఉన్న అనేక ఉద్యోగాలలో ఇవి కొన్ని మాత్రమే.
మీకు ఈ రంగంలో కెరీర్‌పై ఆసక్తి ఉంటే, అవసరమైన స్కిల్స్ నేర్చుకోవడంలో మీకు సహాయపడే అనేక ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.