టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టని విమర్శించారు.
గతంలో ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయడానికే దిక్కు లేదన్న కన్నబాబు అందులో పది శాతం కూడా అమలు చేయలేకపోయారన్న సంగతి గుర్తు చేశారు.ఇప్పుడొచ్చి చెప్పినవన్నీ అమలు చేస్తా అందుకోసం సంతకం చేసిన పేపర్ గ్యారెంటీగా ఇస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
కాపీరాయుడు చంద్రబాబు సొంత ఆలోచన అనేదే లేదని విమర్శలు గుప్పించారు.ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు చెప్పి, అమలు చేసిన పథకం ఏదైనా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు.







