సినిమా ఇండస్ట్రీలో మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్.ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి సర్కిల్ లేక ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అందువల్లే ఇండస్ట్రీలో చాలామందితో పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటేనే మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి.దానివల్ల వాళ్ల సర్కిల్ లో ఏదైనా సినిమాకి సంబంధించిన అవకాశాలు ఉంటే వాళ్లు మనల్ని రిఫర్ చేస్తూ ఉంటారు.
ఇక ఇలా ఇండస్ట్రీలో పైకి వచ్చిన నటులు చాలామంది ఉన్నారు.ఇక ఇదిలా ఉంటే హీరోలతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కూడా చాలా మంది నటులు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యారు.

అందులో ఎన్టీఆర్( NTR ) లాంటి నటుడితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.ఇక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఎన్టీఆర్, రాజీవ్ కనకాల ( Rajeev Kanakala )కాంబినేషన్ స్టార్ట్ అయింది.అప్పటి నుంచి మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ వరకు ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల ఉంటూ వస్తున్నాడు.ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాల్లో రాజీవ్ కనకాల కీలకమైన పాత్రలో నటించి మెప్పించాడు.ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ వల్ల రాజీవ్ కనకాల చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడనే చెప్పాలి…

ఇక ఎన్టీఆర్ వల్ల సక్సెస్ సాధించిన మరొక నటుడు రోలర్ రఘు( Roller Raghu )…ఆది సినిమా నుంచి ఎన్టీయార్ చేసిన ప్రతి సినిమాలో రోలర్ రఘు కూడా ఒక మంచి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు.నిజానికి ఎన్టీఆర్ రిఫర్ చేయడం వల్లే రఘు కి ఎన్టీయార్ సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు.ఇక మొత్తానికైతే రోలర్ రఘు ఇండస్ట్రీలో కమెడియన్ గా, కామెడీ విలన్ గా కూడా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.