కేటీఆర్ సరే ..! కవితకు ఏమైంది ? 

గత  కొంతకాలంగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత సందడి పెద్దగా కనిపించడం లేదు.ఆమె పొలిటికల్  గా యాక్టివ్ గానే ఉన్నా, కేవలం తన పరిధి వరకు మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

 Here Are Many Suspicions That-emelsies Poetry Is Politically Silent Ktr, Kavitha-TeluguStop.com

గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే కవిత సందడి ఎక్కువగా కనిపించేది.నిజామాబాద్ ఎంపీ గా ఆమె ఉండడమే కాకుండా, తెలంగాణ అంతటా విస్తృతంగా పర్యటిస్తూ, పార్టీలో యాక్టివ్ గా ఉండే వారు.

ఇక కేసీఆర్ సైతం కవితను ఎక్కువగా ప్రోత్సహించేవారు.అయితే ఆమె నిజామాబాద్ ఎంపీగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందడంతో కవిత సైలెంట్ అయిపోయారు.

యాక్టివ్ గా రాజకీయాలలో పాల్గొనడం లేదు.స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఆమె గెలుపొందినా , మౌనం గానే ఉంటున్నారు.

దీంతో కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

       ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.

ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వెళ్తారా లేదా అనేది అనుమానమే.ఇక కేసీఆర్ తనయుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి మొదటి నుంచి దూరంగానే ఉంటున్నారు.

ఇక్కడ బాధ్యతలన్నీ కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు చూసుకుంటున్నారు.బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఓడించడమే ప్రధాన ధ్యేయంగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారు.
   

Telugu Hujurabad, Kavitha, Mlc Kavitha, Telangana, Telangana Cm, Trs-Telugu Poli

   అయితే ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారానికి కవిత కూడా దూరంగా ఉండటం , ఆమెకు నియోజకవర్గంలో కాస్తో కూస్తో పట్టు ఉన్నా, సైలెంట్ గానే ఉండడం, అనేక అనుమానాలకు కారణం అవుతోంది.అయితే గత కొంత కాలంగా కేటీఆర్ కవిత మధ్య దూరం పెరిగిందని, అందుకే ఆమెకు టిఆర్ఎస్ లో అంతగా ప్రాధాన్యం దక్కడం లేదనే మరో చర్చా తెర మీదకు వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube