ఒకరికి చెడు చేయాలని భావిస్తే చివరికి మనకే చెడు జరుగుతుందన్న విషయం చాలా సందర్భాల్లో నిజమయింది.దీనినే కర్మ లేదా విధి అని చాలామంది అంటుంటారు.
ఒక్కోసారి ఈ కర్మ ఫలితం వెంటనే ప్రజలకు అందుతుంది దీనిని ఇన్స్టంట్ కర్మ అంటారు ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి మరో వీడియో వైరల్ అవుతోంది.
అందులో ఒక మహిళ( woman ) యువతిపై బాటిల్ విసిరింది.దానికి ప్రతిఫలం ఆమె అనుభవించింది.
వివరాల్లోకి వెళితే, అన్నా హారికీ( Anna Hariki ) అనే 18 ఏళ్ల యువతి అమెరికాలోని ఇండియానాలో కార్ వాష్‌లో ( car wash in Indiana, USA )పనిచేస్తోంది.ఆమె రోజూ కార్లను మెషిన్‌లోకి వెళ్లే ముందు వాటర్ స్ప్రేతో కడుగుతుంది.
ఓ రోజు ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో పాటు తెల్లటి సెడాన్ కారుతో కారు వాష్‌కు వచ్చింది.హారికీ ఎప్పటిలాగే తన పని చేసి కారుకు నీళ్లు చల్లింది.
కానీ కారులోని మహిళ చాలా అసభ్యంగా ప్రవర్తించింది, కిటికీలోంచి అన్నాపైకి నిమ్మరసం బాటిల్ విసిరింది.అది హారికీకి బలంగా తగిలింది.
ఎలాంటి తప్పు చేయకపోయినా మహిళ అలా చేయడంతో అన్నాకి చాలా కోపం వచ్చింది.ఆ కోపంలో ఆమె వాటర్ స్ప్రేని ఆ మహిళపై గురిపెట్టి ఆమెను పూర్తిగా తడిపేసింది.దాంతో మహిళ కేకలు వేస్తూ కిటికీ మూసేయడానికి ప్రయత్నించింది.కానీ అప్పటికే ఆమె తడిసిపోయింది.అక్కడ జరిగిన ఘటనను ఎవరో వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.ఈ వీడియో వైరల్‌గా మారగా, ఆ మహిళకు బుద్ధి చెప్పిన అన్నాను పలువురు ప్రశంసించారు.
వారు ఆమెను హీరో అని పిలిచారు, సరైన పని చేసిందని పొగిడారు.
అన్నాకు కార్ వాష్ ఓనర్లు మద్దతుగా నిలిచారు.ఆ మహిళ అన్నాపైకి బాటిల్ విసరడం చాలా దారుణం అని ఫైర్ అయ్యారు.ఆమె చాలా మొరటుగా తప్పుడు పని చేసిందని విమర్శించారు.
వారు కారు వాష్ కు ఆ మహిళ, ఆమె ప్రియుడిని రాకుండా నిషేధం కూడా విధించారు.యజమానులు తనకు మద్దతుగా ఉన్నందుకు అన్నా సంతోషించింది.
తాను కేవలం తన పని మాత్రమే చేస్తున్నానని, అలా ప్రవర్తించే అర్హత ఆమెకు లేదని చెప్పింది.ఆ మహిళ గుణపాఠం నేర్చుకుని ఇతరుల పట్ల ఇకపై మంచిగా ఉంటుందని తాను ఆశిస్తున్నానని చెప్పింది.