తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకు వస్తూ ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలపైనే పూర్తిగా దృష్టి సారించాయి.ఇప్పటికే బీఆర్ఎస్ ( BRS )అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ బిజెపిలు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈసారి తప్పకుండా తమకే అధికారం దక్కుతుందనే నమ్మకంతో బీఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ లు ఉన్నాయి.మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునేందుకు బిఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుండగా, బిజెపి కాంగ్రెస్( BJP congress ) లు కూడా గెలుపు పై ధీమాగా ఉన్నాయి.
ఒకవైపు ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు చేరికలపై అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి.తమ ప్రత్యర్ధి పార్టీలోని అసంతృప్త నేతలను గుర్తించి వారికి అనేక హామీలు ఇచ్చి పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళదుకు , తమ పార్టీపై ప్రజలు చర్చ జరిగే విధంగా చేసుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ మేరకు సెప్టెంబర్ 17న అన్ని పార్టీలు వేదికగా చేసుకుని రాజకీయ వేడిని రగిల్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.కాంగ్రెస్ పార్టీ ఈనెల 17న నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరు కాబోతున్నారు.సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ తో పాటు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి వారు హాజరవుతుండడంతో, ఈ సభపై భారీగా ఆశలు పెట్టుకుంది.
ఈ సభలోనే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకోవడంతో పాటు , ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చార్జిషీట్ విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకుంది.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఎవరు అడ్డుకోలేరంటూ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వ్యాఖ్యానించారు.సోనియా సభతో కేసీఆర్ ప్రభుత్వం పతనం ప్రారంభమవుతుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.అధికార కాంక్షతో కేసీఆర్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వెంకటరెడ్డి మండిపడుతున్నారు.
ఇక బిజెపి కూడా వచ్చే ఎన్నికల పూర్తిగా దృష్టి సారించింది.బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ సభకు పోటీగా బిజెపి ,బీఆర్ఎస్ పార్టీలు సెప్టెంబర్ 17న అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో వాటిని అడ్డుకునేందుకు బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
తమ పార్టీ నుంచి ఎవరూ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగిస్తూ వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేపట్టాయి.