'ఢీ'లో ప్రదీప్‌ కన్నీళ్లకు అసలు కారణం ఇదే..!

ప్రస్తుతం తెలుగు బుల్లి తెర స్క్రీన్‌ను షేక్‌ చేస్తున్న షోలు జబర్దస్త్‌ మరియు ఢీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.జబర్దస్త్‌ కామెడీతో, అడల్ట్‌ కంటెంట్‌తో దుమ్ము రేపుతున్న ఈ సమయంలో ఢీ ని కూడా రక్తి కట్టించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

 The Reason For Anchor Pradeep Crying In Dhee Show-TeluguStop.com

ఢీ కార్యక్రమంలో కేవలం డాన్స్‌లు మాత్రమే ఉంటే ఎవరు పెద్దగా పట్టించుకునే వారు కాద.కాని ఢీలో ప్రదీప్‌ కామెడీ, సుధీర్‌, రష్మిల రొమాన్స్‌, ప్రియమణి గ్లామర్‌, పూర్ణ లుక్స్‌, శేఖర్‌ మాస్టర్‌ ఎనర్జి.ఇవన్ని కలిపి ఢీ ను సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అయ్యేలా చేస్తోంది.ఢీ ఇంకా టీఆర్పీ రేటింగ్‌ పెంచుకునేందుకు అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్‌ స్కిట్స్‌ చేస్తూ ఉంటారు.

'ఢీ'లో ప్రదీప్‌ కన్నీళ్లకు అసల

తాజాగా ఢీ ఎపిసోడ్‌లో ప్రదీప్‌ ఏడ్వడం చూపించారు.గత వారమే ప్రదీప్‌ ఏడ్చే షాట్స్‌ ను చూపడం జరిగింది.ప్రదీప్‌ ఏడ్వడం చూసి సుధీర్‌ కూడా ఎమోషనల్‌ అవ్వడంను ప్రోమోలో చూపడంతో మొన్నటి ఢీ కి విపరీతమైన టీఆర్పీ రేటింగ్‌ దక్కింది.ప్రదీప్‌ ఎందుకు ఏడ్చాడంటూ అంతా కూడా ఆసక్తిగా చూశారు.

తీరా చూస్తే ప్రదీప్‌ ఏడ్చిన విషయంను చివర్లో కొద్దిగా వేశారు.అది కూడా ఏదో కావాలని డ్రామా క్రియేట్‌ చేసినట్లుగా అనిపిస్తుంది.

నాచురల్‌గా లేకపోవడంతో పాటు టీఆర్పీ రేటింగ్‌ కోసం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

'ఢీ'లో ప్రదీప్‌ కన్నీళ్లకు అసల

ప్రదీప్‌ ఎప్పుడో బుల్లి తెరపైకి ఎంట్రీ ఇవ్వక ముందు ప్రేమలో పడ్డాడట.ఆ అమ్మాయి గుర్తుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నాడట.కాస్త ఫన్నీగా అనిపించినా కూడా వారు ఏదైతే అనుకున్నారో అది వర్కౌట్‌ అయ్యి మంచి టీఆర్పీ రేటింగ్‌ అయితే దక్కింది.

గతంలో ఢీ వారు రష్మి, సుధీర్‌ల మద్య ఇలాంటి సీన్‌ ఒకటి ప్రోమోలో వేసి రికార్డు బ్రేకింగ్‌ లో టీఆర్పీ రేటింగ్‌ దక్కించుకోవడం జరిగింది.రష్మికి సుధీర్‌ లవ్‌ ప్రపోజ్‌ చేసే సీన్‌ అది.అప్పట్లో అది సంచలనం సృష్టించింది.ఈసారి ప్రదీప్‌ కన్నీటితో ప్రేక్షకులను ఢీ తో కనెక్ట్‌ అయ్యేలా నిర్వాహకులు చేసినట్లుగా అనిపిస్తోంది.

మొత్తానికి అంతా కూడా స్క్రిప్ట్‌ ప్రకారం ఢీ కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube