స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) తో నటించడానికి అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా సరే ఎగిరి గంతేస్తుంది.కానీ అలాంటిది ఓ హీరోయిన్ మాత్రం నువ్వు ముసలోడివి అంటూ అవమానకరంగా మాట్లాడిందట.
ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు బలగం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిన కావ్య కళ్యాణ్ రామ్( Kavya Kalyanram ).కావ్య కళ్యాణ్ రామ్ అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమా( Gangotri )లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలోని వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట పాటతో చాలా ఫేమస్ అయ్యింది ఈ నటి.
అయితే అలాంటి ఈ బాలనటి ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.ఇక ఈమె నటించిన మొదటి సినిమా మసూద సూపర్ హిట్ అవ్వడంతో పాటు బలగం సినిమా ఎన్ని అంతర్జాతీయ అవార్డులను అలాగే ఎంత పేరు ప్రఖ్యాతలను సంపాదించి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన ఉస్తాద్ సినిమాలో కూడా తన అందచందాలతో కావ్య కళ్యాణ్ రామ్ మెప్పించింది.
అయితే ఈ హీరోయిన్ చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందట.అలా వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలందరిని చూసిందట.
అయితే ఓ రోజు అల్లు అర్జున్ గంగోత్రి సినిమా షూటింగ్ టైంలో పెద్దయ్యాక నాతో హీరోయిన్ గా చేస్తావా అని అడిగితే మీరు నేను హీరోయిన్ గా చేసే టైంకి ముసలి వాడివి అవుతారు.నేను అస్సలు చేయను అని నవ్వుకుంటూ బదిలిచ్చేదట.
కానీ ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ పెద్దయినా కూడా అల్లు అర్జున్ ఇప్పటికీ అలాగే ఉన్నారు అంటూ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది.