గవర్నర్ వ్యవస్థ వర్సెస్ రాజకీయ వ్యవస్థ ! ముదురుతున్న వివాదాలు ?

రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన గవర్నర్ వ్యవస్థ.ప్రజల నుంచి ఎన్నుకోబడిన రాజకీయ వ్యవస్థకు మధ్య గత కొంతకాలంగా వివాదాలు ముదురుతూనే ఉన్నాయి.

 The Governing System Is Growing Controversy Between Political System Details, G-TeluguStop.com

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ తప్పుపడుతూ వాటిని నిలిపివేస్తూ ఉండడం, ప్రభుత్వ పాలనలో జోక్యం ఎక్కువగా ఉండటం వంటివి ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారింది.ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడిన తాము తీసుకున్న నిర్ణయాలను రాజకీయ కారణాలతో గవర్నర్లు అడ్డుకుంటున్నారనే వాదన ఆయా ప్రభుత్వాలు వ్యక్తం చేస్తుండగా , రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన అధికారాలతోనే తాము పరిపాలనలో జోక్యం చేసుకోవాల్సి వస్తోందని గవర్నర్లు చెబుతున్నారు.

ఇదే విధంగా ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్,  కెసిఆర్ ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతూనే ఉంది.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలను గవర్నర్ అడ్డుకోవడంతో గవర్నర్ విషయంలో ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు పైన జనాలో చర్చ జరుగుతోంది.

ప్రోటోకాల్ ప్రకారం కొన్ని కొన్ని కార్యక్రమాలకు గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించాల్సి ఉంటుంది.అలాగే గవర్నర్ కార్యాలయం లో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించాల్సి ఉంటుంది.గవర్నర్ విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ, ముఖ్యమంత్రికి ఆహ్వానాలు పంపిస్తున్నా, కెసిఆర్ మాత్రం హాజరుకాకపోవడం వంటివి మరింత వివాదాన్ని రాజేస్తున్నాయి.వాస్తవంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 154 లెక్కన చూసుకుంటే.

అన్నిటిపైనా కార్యనిర్వాహక అధికారం గవర్నర్ కు ఉంటుంది.గవర్నర్ నేరుగా లేకపోతే అధికారుల ద్వారా పరిపాలన విధులను నిర్వహించేందుకు అవకాశం ఉంది.

అలాగే సెక్షన్ 159 ప్రకారం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అయినా .పూర్తి అధికారం రాష్ట్ర మంత్రివర్గం పై ఉంటుంది.మంత్రివర్గానికి నాయకత్వం వహించే మొదటి వ్యక్తినే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు.

Telugu Cm Kcr, Kaloji, Sai Ganesh, Telangana, Telqngana Cm-Political

ముఖ్యమంత్రి సూచనలను పాటిస్తూ గవర్నర్ మంత్రిత్వ శాఖలు శాఖలను కేటాయిస్తారు.రాష్ట్ర పరిపాలనలో రాజ్యాంగాన్ని పరిరక్షించడం గవర్నర్ విధుల్లో భాగం.రాజ్యాంగం ప్రకారం గవర్నర్ వ్యవస్థ ఏర్పడడంతో విశిష్ట అధికారాలు ఉన్నాయి.గత కొంత కాలంగా తెలంగాణలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య అనేక అంశాల్లో బేధాభిప్రాయాలు వస్తున్నాయి.

ముఖ్యంగా హుజురాబాద్ ఎన్నికలకు ముందు పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని మంత్రి వర్గం సిఫార్సు చేస్తూ గవర్నర్ కు పంపినా, దానిని ఆమె తిరస్కరించారు.ఇక అప్పటి నుంచి వీరిమధ్య వివాదం నడుస్తూనే ఉంది.

కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో మెడికల్ సీట్ల అవకతవకలపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Telugu Cm Kcr, Kaloji, Sai Ganesh, Telangana, Telqngana Cm-Political

దీనిపై ఆమె నివేదిక ఇవ్వాలంటూ కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను ఆదేశించారు.రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగడం పైన ఆమె ఆందోళన చెందారు.తాను కూడా డాక్టర్ నే అని గుర్తు చేశారు.

అలాగే తెలంగాణ లో చోటు చేసుకున్న ఆత్మహత్యలు పైన గవర్నర్ నివేదికలు కోరారు.అలాగే ఖమ్మం లో సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారణాలను,  రామాయంపేటలో తల్లీకొడుకుల ఆత్మహత్య, నల్గొండలో జరిగిన గ్యాంగ్ రేప్ , ఇలా అనేక అంశాలలో గవర్నర్ జోక్యం చేసుకుంటూ ఉండడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగిస్తోంది.

గవర్నర్ జోక్యం మితిమీరింది అని విమర్శలు చెప్తూనే.గవర్నర్ పైన అనేక సంచలన ఆరోపణలు తెలంగాణ మంత్రులు చేస్తుండడంతో.

వీరిలో ఎవరు గొప్ప ? ఎవరి అధికారాలు ఏంటి అనే చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube