డ్రైవర్ తీరుకు రైతుకు అసహనం.. దాంతో పంటతో రోడ్డు పై..?!

రైతు లేనిదే మనకి జీవోనాపాధి అనేది లేదు.ఎందుకంటే రైతు అనేవాడు కష్టపడితేనే మనకు ఆహారం దొరుకుతుంది.

 The Farmer Is Impatient With The Drivers Attitude With The Crop On The Road ,-TeluguStop.com

మరి అలాంటి రైతును గౌరవించకుండా అవమానిస్తే అంతకంటే దారుణం మరొకటి ఉండదు.అందరి ఆకలి తీర్చే రైతుకు మనం ఎప్పటికి రుణ పడి ఉండాలి.

అయితే కొందరు రైతులను తేలికగా తీసుకుని వాళ్ళని అవమానాలకు గురిచేస్తున్నారు.మొన్నటికి మొన్న ఒక కార్ల షోరూమ్ కు కార్ కొందామని ఒక రైతు వెళితే అతని.

వాలకం చూసి అక్కడ ఉన్న సేల్స్ మాన్ ఆ రైతును అవమానించాడు.దానితో ఆ రైతు అందుకు ప్రతీకారంగా వెంటనే 10 లక్షలను తీసుకుని వచ్చి వాళ్ళ ముందు పెట్టిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణాలో ఒక రైతు అలాగే అవమానపడ్డాడు.

తాజాగా తెలంగాణలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఒక ఆర్టీసీ బస్సులో ఆ రైతును ఎక్కించుకోడానికి డ్రైవర్ నిరాకరించడంతో ఆ పేదరైతు తనదైన శైలిలో రోడ్డు మీద నిరసన తెలిపాడు.అసలు వివరాల్లోకి వెళితే.నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలంలోని మారేడు మాన్ దిన్నె గ్రామంలో గల నల్లమల అడవి సమీపంలోని ఒక మారుమూల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.మారుమూల గ్రామం అవ్వడంతో ఆ గ్రామం మీదుగా కేవలం ఒకే ఒక్క బస్సు అంటే అచ్చంపేట డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు మాత్రమే వెళుతుంది.

కాగా మాన్‌దిన్నె గ్రామానికి చెందిన గోపయ్య అనే రైతు తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను ప్రతిరోజు ఈ బస్సులోనే కొల్లాపూర్ పట్టణానికి తీసుకువెళ్లి అమ్ముకునే వారు.ఆయనతో పాటు ఆయన పండ్ల లగేజ్ కూడా టికెట్ తీసుకుంటాడు.

కానీ శుక్రవారం రోజు మాత్రం అలా జరగలేదు.ఎప్పటిలాగానే బొప్పాయి పండ్ల బుట్టలతో బస్ స్టాపు వద్ద నిలిచాడు.

కానీ ఆ బస్సు ఆర్టీసీ డ్రైవర్ పండ్లను ఈసారి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

Telugu Achanpeta Depo, Gopaiah, Latest, Rtc Bus-Latest News - Telugu

అలా అంత దూరం పోయి పండ్లు అమ్మితే నాకు మిగిలేదే కాస్తే అని ఎందుకు పండ్లను ఉచితంగా ఇవ్వాలని రైతు అడిగాడు.అందుకు ఆ రైతును ఎక్కించుకోడానికి నిరాకరిస్తూ ఆ బస్సును ముందుకుపోనిచ్చాడు డ్రైవర్.ఆర్టీసీ డ్రైవర్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన రైతు గోపయ్య కొన్ని గంటల తర్వాత వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసాడు.

ఆ ఆర్టీసీ బస్సు కొల్లాపూర్ నుంచి తిరుగు ప్రయాణంలో మాన్‌దిన్నె గ్రామానికి చేరుకోగా రోడ్డుపైనే కూర్చుని ఉన్న రైతు గొపయ్య బొప్పాయి పండ్ల గంపలను అడ్డంగా పెట్టేసి బస్సును అడ్డుకున్నాడు.బస్సుకు అడ్డంగా బొప్పాయి పండ్ల బుట్టలను ఉంచి రైతు నిరసన చేస్తోన్న దృశ్యాన్ని స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.

ఈ ఘటన పట్ల ఉన్నతాధికారులు స్పందించి రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిందిగా గోపయ్య కోరుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube