కరిసిన పాముతో హాస్పిటల్‌కు చేరిన రైతు.. సిబ్బంది పరుగులు

తమిళనాడుకు చెందిన 87 ఏళ్ల రంగనాథన్‌ అనే రైతును ఇటీవల వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన సమయంలో పాము కరిచింది.పాము కరిచిందని హాస్పిటల్‌కు వెళ్తే ఏ పాము కరిచింది అంటూ వైధ్యులు ప్రశ్నిస్తారు.

 The Farmer Goes With Bitten Snake To The Hospital-TeluguStop.com

ఆ విషయం గతంలో ఒకసారి అనుభవం అయ్యింది.దాంతో రంగనాథ్‌న్‌ తనకు కరిచిన పామును వెదికి పట్టుకుని, దాన్ని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాడు.

వైధ్యులకు ఆ పాము కరిచిందని చూపించి చికిత్స పొందాడు.

కడలూరులోని విరుదాచలంలో రంగనాథన్‌ను పాము కరిచింది.ఆ పాము విషం వల్ల రంగనాథన్‌కు ప్రమాదం పొంచి ఉంది.అయినా కూడా ధైర్య సాహసాలతో ఆ పామును పట్టుకుని వచ్చాడు.

రంగనాథన్‌ పామును తీసుకు రావడంతో ఆ పాము ఎలాంటిది అనేది చూసి వెంటనే చికిత్స ప్రారంభించారు.అయితే రంగనాథన్‌ తీసుకు వచ్చిన పామును చూసి వైధ్యులతో పాటు, సిబ్బంది కూడా హడావుడి చేశారు.

ఆ పాము ఎక్కడ జారి హాస్పిటల్‌లో పడి జనాలను కరుస్తుందో అని భయపడ్డారు.

రంగనాథన్‌ ధైర్యంగా పామును పట్టుకు రావడంతో అంతా కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు.దేశ వ్యాప్తంగా ఈ విషయం వైరల్‌ అయ్యింది.87 ఏళ్ల వృద్ద రైతు పాముతో రావడంతో స్థానికంగా అంతా కూడా అవాక్కవుతున్నారు.ఎలా ఈ రైతు ఆ పామును పట్టుకు వచ్చాడని అంటున్నారు.పాము కుట్టింది అంటే సగం భయంతోనే చస్తారు.కాని రంగనాథన్‌ మాత్రం అనూహ్యంగా పామును తీసుకు రావడం వైరల్‌ అయ్యింది.కుటుంబ సభ్యుల కంటే ముందు హాస్పిటల్‌కు వెళ్లడం అభినందనీయం.

రంగనాథన్‌ కుటుంబ సభ్యులకు విషయం చెప్పి, ఆ తర్వాత హాస్పిటల్‌కు వెళ్తే మరింత ప్రమాదం జరిగేది.కాని ఆయన మాత్రం నేరుగా హాస్పిటల్‌కు వెళ్లడంతో ఆయనకు పెద్ద ప్రమాదం తప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube