తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు మరో ఐదేళ్లపాటు తిరుగే లేకపోవడం … మెజార్టీ పూర్తి స్థాయిలో ఉండడంతో ఇక వెనక్కి తిరిగి చూసే పనిలేకుండా ఉంది.దీంతో ఇప్పుడు తమ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే పనిలో పడింది.
దీనిలో భాగంగానే తెలంగాణాలో టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టే పనిలో పడింది.ఆ మేరకు చాలా వరకు సక్సెస్ అయినట్టే కనిపించింది.
ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమయం అతి సమీపంలో ఉండడంతో… టీడీపీ మీద కక్ష తీర్చుకునే పనిలో నిమగ్నం అయ్యింది.దీనిలో భాగంగానే … ఏపీ టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకుని ఆ పార్టీని వీక్ చేయాలని చూస్తోంది.
అందుకే తెలంగాణాలో భారీగా ఆస్థిపాస్థులు ఉండి ఏపీ టీడీపీలో కీలకంగా ఉన్న నాయకులను గుర్తించి వారిని అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది.
టీడీపీ పై టీఆర్ఎస్ అనుసరిస్తున్న ఈ వ్యూహం సిట్టింగ్ ఎమ్యెల్యే, ఎంపీలను బాగా ఇబ్బంది పెడుతోంది.ఇప్పుడు.కొంత మంది భూముల్లో.
ప్రభుత్వ స్థలం అనే బోర్డులు వెలుస్తున్నాయి.కొంత మందికి రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు పాల్పడ్డారనే నోటీసులు అందుతున్నాయి.
మరికొంత మందికి.ఎప్పుడో.
జరిగిన వ్యవహారాల వెనుక లావాదేవీలు చెప్పాలని సమాచారం వస్తోంది.హోటళ్ల లాంటి వ్యాపారాలు ఉన్న వారికి.
మీరు నియమ నిబంధనలు ఎందుకు పాటించడం లేదు అంటూ… నోటీసులు అందుతున్నాయి.ఇదంతా టీడీపీ ని ఇరుకున పెట్టడానికి టీఆర్ఎస్ అనుసరిస్తున్న కొత్త ఎత్తుగడగా … అర్ధం అవుతోంది అంటూ… టీడీపీ విమర్శిస్తోంది.
ఈ విధంగానే ఓ టీడీపీ ఎమ్మెల్యేకు నగర శివారులో కొంత స్థలం ఉంది.హఠాత్తుగా ఆ స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభించారు.అయితే….కనీసం.
సబ్‌స్టేషన్‌కు ఆ స్థలం అవసరం కాబట్టి సేకరిస్తున్నామన్న సమాచారం కూడా ఆయనకు ఇవ్వలేదు.ముందస్తుగా ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టేశారు.
మరో ఎమ్మెల్యేకు కూడా ఇలాంటి కారణంతోనే నోటీసులు జారీ అయ్యాయని ప్రచారం మొదలయ్యింది.మరో ఎమ్మెల్యేకు ఎప్పుడో కొన్న భూముల రిజిస్ర్టేషన్ లో ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించారని .ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని బోర్డులు కూడా పెట్టేశారట.ఈ సణాగతులన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగి నాయకుల గత తప్పులను కూడా లేవనెత్తుతుండడం ఏపీ టీడీపీ నాయకులకు మింగుడుపడం లేదు.