తమ రాజకీయ అవసరాలకు కోసం ఆంధ్రప్రదేశ్లోని అధికార ప్రతిపక్ష పార్టీలను తనకు కావలసిన విధంగా వాడుకుంటున్న కేంద్రం, అత్యంత కీలకమైన సందర్భంగా వ్యవహరించిన వైనం మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా తెలుగు దేశానికి , అధికార వైసిపికి( YCP ) సమాన దూరం పాటిస్తూలోపాయికారిగా ఇరు పార్టీలతో సంబంధాలను మెయింటైన్ చేసే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇలాంటి కీలక సమయంలో మాత్రం తమ స్టాండ్ ఏమిటో కూడా చెప్పకుండా అసలు తమకు సంబంధమే లేని వ్యవహారం అని ఆంధ్రప్రదేశ్ తమ దేశంలోనే లేదన్నట్టుగా కనీస స్పందన కూడా ప్రకటించకపోవడం విశేషం.
అయితే అంతర్గతంగా కేంద్రానికి ఇవన్నీ తెలిసిన విషయాలేనని కేంద్రంతో సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేసే జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నివేదికను కేంద్రానికి ఇచ్చి వారి అనుమతితోనే ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లిందని అందుకే కేంద్ర పెద్దల నుంచి కనీస మద్దతు గానీ స్పందన కానీ రాలేదన్నది పొలిటికల్ విశ్లేషకులు వాదన.
మరో వైపు సిపిఐ నారాయణ( CPI Narayana ) లాంటి వారైతే కేంద్రం నిజస్వరూపాన్ని చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని, కేంద్రం పైకి చూపిస్తున్న సఖ్యతను నమ్మితే ముందుకు వెళితే బాబు మునిగిపోతారని, ఇప్పటికైనా కేంద్రంతో తెగతెంపులు చేసుకొని తమతో కలిసి రావాలంటూ నారాయణ వ్యాఖ్యానించారు.ఏది ఏమైనా తమకు చంద్రబాబు కంటే జగనే ముఖ్యమని తమ స్పందన ద్వారా కేంద్ర పెద్దలు నిరూపించారు అంటూ కొంతమంది పొలిటికల్ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.తొందర్లోనే జనసేన- తెలుగుదేశం -బిజెపి పొత్తు తుది అంకానికి చేరుకుంటుందని అంతర్గతంగా పొత్తు చర్చలు జరుగుతున్నాయి అంటూ తెలుగు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు విశ్వసనీయత లేనట్టుగానే భావించాలి.
మరి ఇలాంటి కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చిన కేంద్ర పెద్దలపై చంద్రబాబు( Chandrababu Naidu ) వైఖరి ఏ విధంగా ఉంటుందో మరికొద్ది రోజుల్లో ఒక అంచనాకు రావచ్చు.అయితే ఇంత కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో లేకపోవడం వ్యూహాత్మకమైనని వార్తలు వస్తున్నాయి .కేవలం చట్టం తాను పని తాను చేసుకో పోతుందని తమ ప్రమేయం ఏమీ లేదని కొన్ని వర్గాలకు సంకేతాలు ఇవ్వడానికే జగన్( YS Jagan Mohan Reddy ) విదేశీ ప్రయాణం పెట్టుకున్నారని, అక్కడి నుంచి అన్ని విషయాలను మోనిటర్ చేస్తున్నారని ,ఎప్పటికప్పుడు లాయర్లకు సూచనలు చేస్తున్నారంటూ తెలుగుదేశం అనుకూలం మీడియాలో వార్తలు వస్తున్నాయి.అందుకే ప్రభుత్వం తరపు వాదించిన లాయర్ల 48 గంటల కాల్ రికార్డింగ్లను కూడా కోర్టుకు సమర్పించాలని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూధ్రా( Siddhartha Ludra ) అడగటం విశేషం.