మద్యం మత్తులో నెలల పసికందును నేలకేసి కొట్టిన కసాయి తండ్రి..!

ఒక వ్యక్తికి చెడు వ్యసనాలు ఉన్నాయంటే ఎప్పుడో ఒకసారి ఆ కుటుంబం రోడ్డున పడుతుంది.చెడు వ్యసనాలు అనేటివి మనిషిని విచక్షణ జ్ఞానం కోల్పోయేలా చేస్తాయి.

 The Butcher's Father Who Beat The One-month-old Baby To The Ground In Drunkennes-TeluguStop.com

విచక్షణ జ్ఞానం లేని వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు,చేసే పనులు చాలా దారుణంగా ఉంటూ కుటుంబాలను నాశనం చేసేస్తాయి.ఇలాంటి కోవలోనే ఓ వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసై విచక్షణా జ్ఞానం కోల్పోయి తన సొంత కూతురిని నేలకేసి కొట్టి చంపేశాడు.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh ) లోని లఖ్నవూ లోని సీతాపూర్ కు చెందిన మమత, దర్నాగ్ కు చెందిన సౌరబ్ గౌతం ప్రేమించుకుని ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.సౌరబ్ గౌతమ్ స్థానికంగా ఉండే ఒక అతిధి గృహంలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు.

అయితే సౌరబ్ తాగుడుకు బానిస అయ్యాడు.ఈ క్రమంలో విధులు నిర్వహించుకుని పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.

Telugu Baby, Drunkenness, Sitapur, Uttar Pradesh-Latest News - Telugu

ఇంట్లో సౌరబ్ కు అతని భార్య మమతకు మధ్య మాట మాట పెరిగి పెద్ద వివాదం జరిగింది.దీంతో మద్యం మత్తులో ఉన్న సౌరబ్ తన భార్య మమత( Mamta ) చేతిని విరగొట్టాడు.మంచంపై నిద్రిస్తున్న నెలల కుమార్తెను కోపంతో నేలకేసి కొట్టాడు.మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో మై మరిచిపోయి ఆ పసికందు చనిపోయేంతవరకు విచక్షణ రహితంగా కొట్టి ప్రాణాలు తీసేశాడు.

Telugu Baby, Drunkenness, Sitapur, Uttar Pradesh-Latest News - Telugu

మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు( Police ) నిందితుడు సౌరబ్ గౌతంపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.కన్నతండ్రి కసాయిగా మారి నెలల పసికందును చంపేయడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.తన కళ్ళముందే తన కూతురిని చంపేయడంతో మమతా కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube