ఏ పార్టీలోనూ లేనంత స్వేచ్ఛ తెలంగాణ కాంగ్రెస్ లో ఉంటుంది.ఇక్కడ సొంత పార్టీ నాయకుల పైన బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉండడం పదే పదే కనిపిస్తుంది.
ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ అధిష్టానం వద్ద పంచాయతీ పెడుతూ హడావుడి చేస్తుండటం తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటూ ఉంటుంది.ఈ వ్యవహారాలు తెలంగాణ సీనియర్ నాయకులకు శర్మములు కావడం పరిపాటిగా మారింది.
అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసే విషయంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది.దీనిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడంతో ఇక్కడ పరిస్థితిని మార్చేందుకు రంగంలోకి దిగింది.
ఈ మేరకు పార్టీలో దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డికి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు రాజకీయ వ్యూహకర్తను సైతం నియమించింది.
సునీల్ కానుగోలు అనే ప్రశాంత్ కిషోర్ శిష్యుడు తెలంగాణ కాంగ్రెస్ కు రాజకీయ వ్యూహాలను అందిస్తున్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న ప్రతి పరిణామాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక రూపంలో అందిస్తున్నారు.
దీంట్లో ఎక్కువగా సొంత పార్టీ నాయకులు కారణంగానే కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది అని, గ్రూపు రాజకీయాలు ముదిరిపోయాయి అనే రిపోర్టులు అందిస్తున్నారు.ఇక ఇప్పుడు నియోజకవర్గాల వారీగా రహస్యంగా సర్వేలు నిర్వహిస్తూ.
కాంగ్రెస్ నాయకుల పనితీరుపైన నిఘా పెట్టడంతో, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా టెన్షన్ పడుతున్నారు.ముఖ్యంగా సీనియర్ నాయకుల విషయంలో ఈ నిఘా తీవ్ర తరం చేయడంతో… తమ గురించి ఎటువంటి రిపోర్టులు అధిష్టానానికి అందుతున్నాయి అనే విషయంలో సీనియర్ నాయకులు టెన్షన్ పడుతున్నారు.
రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు నేరుగా రాహుల్ గాంధీ తోనే అన్ని విషయాలను చర్చిస్తూ ఉండడంతో, ఇప్పుడు సీనియర్ నాయకులు కూడా టెన్షన్ పడుతున్నారు.కొద్దిరోజుల కిందట తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంగా సీనియర్ నాయకులకు రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.
నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలం పెంచడం మానేసి గాంధీభవన్ చుట్టూ తిరిగిన ప్రయోజనం ఉండదని, ప్రజాక్షేత్రంలో బలమైన నేతలకు, తప్పకండా గెలుస్తారు అనుకున్నవారికి సర్వే నివేదికల ఆధారంగా టికెట్ కేటాయిస్తాము అంటూ రాహుల్ తేల్చిచెప్పడంతో.కాంగ్రెస్ జూనియర్, సీనియర్ నాయకులంతా నియోజకవర్గాల్లో ఎక్కువగా పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఎప్పటికప్పుడు తమ గురించి సునీల్ ఏ విధమైన నివేదిక అధిష్టానం పెద్దలకు పంపించారు అనే విషయాన్ని ఆరా తీస్తూ టెన్షన్ పడుతున్నారట.