సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ కామెడీ స్టార్ట్!  

టాలీవుడ్ లో కామెడీ చిత్రాల దర్శకుడుగా ప్రస్తుతం తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి. తాజాగా అతను సందీప్ కిషన్ హీరోగా హాన్సిక హీరోయిన్ గా తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ తాజాగా కర్నూల్ లో స్టార్ట్ అయ్యింది.

ఈ మధ్య వరుస ఫ్లాప్ లతో వున్నా సందీప్ కిషన్ కి, అలాగే తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయిన హాన్సిక కాంబినేషన్ లో ఆచారి అమెరికా యాత్ర లాంటి ఫ్లాప్ తర్వాత నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా తెనాలి రామకృష్ణ. మరి ముగ్గురు ఫ్లాప్ స్టార్స్ కాంబినేషన్ లో మొదలైన ఈ సినిమా వారికి ఎ మేరకు సక్సెస్ ఇస్తుంది చూడాలి.