చంద్రబాబు అరెస్ట్( chandra babu arrest ) తర్వాత వరుస పెట్టి జరుగుతున్న వ్యూహాత్మక పరిణామాలు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి ఆ పార్టీ కీలక నాయకులలో ఆలోచనలు రేకెత్తించాయని చెబుతున్నారు.రేపు లోకేష్( Nara lokesh ) ను కూడా ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ఇరికించే విధంగా అధికార వైకాపా ప్రభుత్వం ముందుకు వెళుతుందని కచ్చితంగా రోజుల వ్యవధిలోనే లోకేష్ అదుపులోకి తీసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి సమయం లో తెలుగుదేశానికి తదుపరి నాయకత్వం ఎవరు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.తెలుగుదేశానికి సరైన నాయకత్వం లేదని జనసేన దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు పార్టీ నాయకులను ఇబ్బంది పేడుతున్నట్లుగా తెలుస్తుంది.
మరోపక్క నందమూరి వంశం నుంచి బాలయ్య పెద్దరికం తీసుకోవడానికి ముందుకు వస్తున్నప్పటికీ నందమూరి నాయకత్వంలో పనిచేయడానికి మెజారిటీ నాయకులు ఇష్టపడటం లేదనేది ఈ వార్తల తాలూకు సారాంశం.అలాంటి వారందరికీ ఇప్పుడు నారా బ్రాహ్మణి( Nara Brahmani ) పెద్ద దిక్కుగా కనపడుతున్నారు.బాలయ్య కుమార్తె అయినప్పటికీ టెక్నికల్ గా ఆమె లోకేష్ బాబు భార్య.నారా వారి కోడలు.అంతే కాకుండా ఆమె నందమూరి తారక రామారావు మనవరాలు కూడా కావడం, తెలుగు దేశం అదినేత కోడలు ప్లస్ బావి నేత లోకేష్ బాబు బార్య కావడంతో ఈమెకు తెలుగుదేశం నాయకత్వాన్ని అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారట.బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నారా బ్రాహ్మణి చంద్రబాబు కుటుంబ వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
అయితే ఆమెకు రాజకీయాల్లో ఆసక్తి ఉన్నట్లుగా ఏప్పుడూ కనిపించకపోయినప్పటికీ ఇప్పుడు అవసరార్థం కచ్చితంగా పార్టీ బాధ్యతలను భుజానికి ఎత్తుకుంటారు అన్నది తెలుగుదేశం కీలక నాయకుల ఆలోచనగా తెలుస్తుంది .అయితే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే చదివిన బ్రాహ్మణి తెలుగు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంది.అయితే ఒక్కసారి ఆ బాధ్యతలను అందుకుంటే మిగతావన్నీ సెట్ అవుతాయని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం నాయకత్వం నారా కుటుంబం కిందే ఉండాలన్నది పార్టీకి నిబద్దులైన నాయకుల ఆలోచనగా తెలుస్తుంది మరి లోకేష్ అరెస్ట్ గనుక కాయమైతే పార్టీ పగ్గాలు బ్రాహ్మణ చేపట్టడం ఖాయమే అన్న ప్రచారం అయితే జరుగుతుంది.