అభివృద్ధి నమూనాను దేశానికి అందించిన ఘనత తెలంగాణ దే : కేటీఆర్

2024 తర్వాత కేంద్రంలో ప్రధానిగా మోదీ ఉండరని తాను అంచనా వేస్తున్నానంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు భారాసా జాతీయ కార్యదర్శి కల్వకుంట్ల తారక రామారావు( K.T.Rama Rao )గురువారం విలేకరులతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారుతెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ జరగడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాలలో కానీ బాజాపా పాలన లో( BJP ) ఉన్న రాష్ట్రాలలో కానీ తెలంగాణ స్థాయి సంక్షేమ పథకాలు( Welfare schemes ) ఏమున్నాయో ఆ నేతలు చెప్పాలని ఆయన సవాలు విసిరారు.

 Telangana Is The Role Model To Country Says Ktr , Telangana , Ktr, Brs , Cm Kc-TeluguStop.com

మహారాష్ట్రలో ఇప్పుడు రైతుబంధు ప్రవేశపెట్టార,ని ఇక్కడ టీ హబ్ లాగా అక్కడ ఎమ్ హబ్ పెడుతున్నారని.తలసరి ఆదాయంలో మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందుందని ఆయన చెప్పుకొచ్చారు .ప్రతిపక్షాలకి ఏదో ఒక కారణం కావాలని ప్రతిదానిమీద యాగీ చేస్తున్నారని అందుకే అనవసరమైన విమర్శలు చేస్తే పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు .

Telugu Cm Kcr, Congress, Karnataka, Rahul Gandhi, Telangana, Ts, Welfare Schemes

ద్రవ్యోల్బణం లో కానీ, రూపాయి విలువ పతనంలో గాని నిరుద్యోగంలో కానీ ప్రధాని మోదీ అనేక రకాలుగా విఫలమయ్యారని, దేశ చరిత్రలో ఇంతకంటే అసమర్ధ ప్రధాని మరొకరు ఉండరంటూ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమైనప్పుడు దేశంలో కూడా సాధ్యమవుతుందని జాతీయస్థాయిలో ప్రతిపక్షాలు ఒక వ్యక్తి మీద ద్వేషంతో కాకుండా దేశం మీద ప్రేమతో రాజకీయాలు చేయాలని ఆయన సూచించారు.రాహుల్ గాంధీ వ్యవహారం చూస్తుంటే ఆయన రాజకీయ పార్టీ నడపటం కన్నా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని రాజకీయాల్లో అన్ని రకాల పోరాటాలకు సిద్ధం కావాలని, పారిపోకూడదని ఆయన హితవు పలికారు.

Telugu Cm Kcr, Congress, Karnataka, Rahul Gandhi, Telangana, Ts, Welfare Schemes

కాంగ్రెస్ కర్ణాటక( Karnataka )లో గెలవలేదని అక్కడ బాజాపా ను ప్రజలు ఓడించారని, కేవలం మరో అవకాశం లేకే అక్కడ కాంగ్రెస్ గెలిచిందని ఆయన చెప్పుకొచ్చారు.హైదరాబాదు ని అన్నీ రకాలుగానూ అభివృద్ధి చేసినప్పటికీ మౌలిక సదుపాయాల పరంగా మరింత అభివృద్ధి అవసరమని, మెట్రోను 250 కిలోమీటర్లకు విస్తరించాలని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, రాష్ట్ర ప్రజలు మరొకసారి తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు.దేశంలో అన్ని వర్గాల ప్రజలకు, రాష్ట్రాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతోనే తాను డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నానని, దీనిపై ఆరోగ్యవంతమైన చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube