సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు ఎన్నో కొత్త తరహా వీడియోలు దర్శనమిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.ఎంతోమంది తమలో ఉన్న ప్రతిభను వెలికి తీసి అందరిచే ప్రశంసలు పొందుతున్నారు.
వ్యవసాయ రంగంలో( Farming ) రోజురోజుకు యాంత్రికీకరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే.గతంలో ఎద్దులతో వ్యవసాయం చేసేవారు.
కర్రలతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు.గతంతో పోలిస్తే అభివృద్ధి చెందినా కూడా వ్యవసాయానికి అయ్యే వ్యయం విపరీతంగా పెరిగిపోయింది.
వ్యవసాయ రంగంలో రోజురోజుకు పెట్టుబడులు పెరుగుతున్న.గిట్టుబాటు ధర మాత్రం పెరగకపోవడంతో చాలామంది సన్నకారు, చిన్న కారు రైతులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.యంత్రాల ధరలు పెరుగుతూ ఉండడంతో ఓ సన్న కారు రైతు ఓ మంచి ఉపాయం ఆలోచించి అందరినీ ఆశ్చర్యపరచాడు.
తెలంగాణ లోని( Telangana ) నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముధోల్ కు చెందిన సొంకాంబ్లీ బాబు అనే రైతు తన పంట పొలంలో పత్తి వేశాడు.ప్రస్తుతం అందరూ రైతులు పొలంలో ట్రాక్టర్ తో వ్యవసాయ పనులు చేస్తారు అని అందరికీ తెలిసిందే.కానీ ఈ రైతు కాస్త వినూత్నంగా ఆలోచించి లూనా బైక్ తో( Luna Bike ) పంట చేనులో వ్యవసాయ పనులు చేసి చూసే వారందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ రైతుకు ఎకరం భూమి ఉంది.అందులో పత్తి వేసేందుకు తన వద్ద ఎడ్లు లేకపోవడం, ట్రాక్టర్ తో పనులు చేపడితే ఆర్థికంగా భారం అధికం అవుతూ ఉండడంతో ఇలా లూనాతోనే వ్యవసాయ పనులు చేశానని తెలిపాడు.తన మనవడు లూనా నడుపుకుంటూ వెళ్తూ ఉంటే దానికి నాగెలి కట్టి వెనుక నుండి తాత పొలం దున్నాడు.ఉపాయం ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటూ ఈ వీడియో చూసిన వారంతా తాతా-మనవళ్ళను ప్రశంసిస్తున్నారు.